మెగాస్టార్ కి ఉరి సెంటిమెంట్ కలిసొస్తుందా..?

Published : Aug 23, 2018, 04:01 PM ISTUpdated : Sep 09, 2018, 12:14 PM IST
మెగాస్టార్ కి ఉరి సెంటిమెంట్ కలిసొస్తుందా..?

సారాంశం

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవే లేదు. పలానా రోజు సినిమా విడుదలైతే హిట్ కొడుతుంది, సినిమాలో ఆ నటుడు కనిపిస్తే చాలు సినిమా హిట్ అవుతుందని ఇలా రకరకాల సెంటిమెంట్లు. 

సినిమా ఇండస్ట్రీలో సెంటిమెంట్లకు కొదవే లేదు. పలానా రోజు సినిమా విడుదలైతే హిట్ కొడుతుంది, సినిమాలో ఆ నటుడు కనిపిస్తే చాలు సినిమా హిట్ అవుతుందని ఇలా రకరకాల సెంటిమెంట్లు. పాజిటివ్ సెంటిమెంట్లు ఎన్ని ఉంటాయో నెగెటివ్ సెంటిమెంట్లు కూడా ఆ రేంజ్ లోనే ఉంటాయి.  ఇప్పుడు ఒక సెంటిమెంట్ చిరంజీవి 'సై రా' సినిమాను కూడా వెంటాడుతోంది.

అదేంటంటే చిరంజీవి సినిమాల్లో ఉరి వేసే సీన్లు ఉంటే ఆ సినిమా సూపర్ హిట్ అనే భావన అభిమానుల్లో ఉంది. గతంలో 'ఖైదీ', 'అభిలాష', 'ఠాగూర్' లాంటి చిత్రాల్లో చిరంజీవి పాత్రకు ఉరి శిక్ష వేసిన సీన్లు ఉన్నాయి. ఆ సినిమాలు ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు చిరంజీవి నటిస్తోన్న 'సై రా నరసింహారెడ్డి' సినిమాలో కూడా ఉయ్యాలవాడని ఉరితీసే సన్నివేశాల్లో చిరంజీవి కనిపించబోతున్నారు.

సినిమాలో ఆ సన్నివేశాలు హైలైట్ గా నిలుస్తాయని చెబుతున్నారు. అయితే ఇక్కడ మరో ట్విస్ట్ ఉంది. ఆ సినిమాలన్నింటిలో చిరంజీవి పాత్ర చివరకి బ్రతికే ఉంటుంది. కానీ 'సై రా' చిరు పాత్ర దేశ స్వాతంత్య్రం కోసం ప్రాణాలు అర్పిస్తోంది. మరి ఈ సినిమాలో ఉరి సెంటిమెంట్ ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి!  

PREV
click me!

Recommended Stories

Toxic Teaser Review: టాక్సిక్ టీజర్ రివ్యూ.. బోల్డ్ సీన్లలో రెచ్చిపోయిన యష్‌.. `కేజీఎఫ్‌ 2`కి తాత
మరో వ్యక్తితో కనిపించిన యాంకర్ సుమ, నాన్నకి చెబుతా అంటూ కొడుకు వార్నింగ్.. కత్తి తీసుకుని..