మరో రికార్డ్ సాధించింది కన్నడ డబ్బింగ్ మూవీ కాంతారా. వెండితెరపైనే కాకుండా.. డిజిటల్ మీడియాలో కూడా భారీ రెస్పాన్స్ సాధించిన ఈసినిమా.. టెలివిజన్ లో కూడా అద్భుతాన్ని సృష్టించింది.
కన్నడ మల్టీ టాలెంటెడ స్టార్ రిషబ్ శెట్టి హీరోగా.. స్వీయ దర్శకత్వంలో.. కన్నడ నాట సంచలనం సృస్టించిన సినిమా కాంతారా. ఈమూవీ తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లో కూడా డబ్బింగ్ చేయబడి.. పాన్ ఇండియా రేంజ్ లో దుమ్మురేపింది. అన్ని భాషల్లో కనెక్షన్ల వర్షం కురిపించింది సినిమా. దర్శకుడిగా, నటుడిగా రిషబ్ శెట్టిని కెరీర్ లో ఎన్నో మెట్లు ఎక్కించింది ఈ ఒక్క సినిమా. దాంతో ఇటు టాలీవుడ్ తో పాటు.. బాలీవుడ్ నుంచి కూడా రిషబ్ శెట్టికి వరుసగా ఆపర్లు వచ్చిపడుతున్నాయి.
కేవలం 15 కోట్లతో తెరకెక్కిన కాంతార సినిమా.. కన్నడతో పాటు తెలుగులో కూడా దాదాపు రెట్టింపు షేర్‌ను రాబట్టి సరికొత్త రికార్డులను నెలకొల్పింది. తెలుగులో ఈ సినిమాకు కేవలం 2.5 కోట్ల బిజినెస్ జరిగింది. కానీ ఫుల్ రన్ ముగిసే సరికి ముప్పై కోట్ల కలెక్షన్లు సాధించి అత్యధిక లాభాలు తెచ్చిపెట్టిన డబ్బింగ్ సినిమాగా రికార్డు సృష్టించింది. ఈ కన్నడ సినిమా ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 450 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టింది.
కెజిఎఫ్ తరువాత ఆ రేంజ్ లో రెస్పాన్స్ సాధించిన సినిమాగా కాంతార అద్భుతాన్ని సాధించింది. ఇటు డిజిటల్ మీడియాలో కూడా భారీ వ్యూవర్ షిప్ తో దూసుకుపోతోంది కాంతార సినిమా.. తాజాగా టెలివిజన్ లో కూడా బ్లాస్టింగ్ టీఆర్పీ సాధించింది తెలుగు వర్షన్ మూవీ. రీసెంట్ గా మా టీవిలో టెలికాస్ట్ అయింది సినిమా 12.35 రేటింగ్ సాధించినట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఏ సినిమా కూడా సాధించలేని రికార్డ్ ను ఈ సినిమా సాధించింది.
రీసెంట్ గా తెలుగులో స్టార్ హీరోల సినిమాలు కూడా పదిలోపు టీఆర్పీలనే సాధిస్తూ వస్తున్నాయి. ఈక్రమంలో స్ట్రెయిట్ సినిమా కాకపోయినా.. డబ్బింగ్ సినిమా ఈరేంజ్ లో రెస్పానస్ సాధించడం రికార్డ్ అనే చెప్పాలి. మెగాస్టార్ గాడ్‌ఫాదర్ కూడా కేవలం 7.69 టీఆర్పీ రేటింగ్ మాత్రమే సాధించగా.. డబ్బింగ్ సినిమా 12 పాయింట్లు దాటి రేటింగ్ సాధించడం ఇండస్ట్రీ వర్గాలనుఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇక ఈసినిమా ప్లాష్ బ్యాక్ కథతో కాంతార కు ప్రీక్వెల్ కూడా రెడీచేస్తున్నారు మేకర్స్. ఇక ప్రీక్వెల్ ఎలా ఉంటుందా అని అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.