ప్రముఖ సీనియర్ నటి కన్నుమూత!

By AN TeluguFirst Published Sep 20, 2019, 9:47 AM IST
Highlights

బెంగళూరుకు చెందిన పద్మాదేవి బళ్ళారి రాఘవాచార్యులు ద్వారా నాటకరంగంలో ప్రవేశించి హెచ్‌ఎల్‌ఎన్‌ నాటక సంస్థలో నటించారు. ఆ తరువాత సొంతంగా ఓ నాటకం కంపనీ కూడా మొదలుపెట్టారు. 
 

ప్రముఖ సీనియర్‌ నటి కె.పద్మాదేవి(95) గురువారం కన్నుమూశారు.వృద్దాప్యం కారణంగా ఆమె మరణించినట్లు తెలుస్తోంది. భక్తద్రువ(1934) అనే చిత్రంతో కన్నడ సినిమారంగంలో ఎంట్రీ ఇచ్చిన ఆమెకి 1936లో విడుదలైన సంసారనౌక సినిమా మంచి పేరు తీసుకొచ్చింది. 

సినిమాలో నటించడంతో ఆమె నాలుగు పాటలు కూడా పాడారు. వసంతసేన, భక్తసుధామ, జాతకఫల ఇలా ఎన్నో మంచి చిత్రాల్లో ఆమె నటించారు. నటిగానే కాకుండా రేడియో, పత్రికారంగంలోనూ ఆమె పని చేశారు. బెంగళూరుకు చెందిన పద్మాదేవి బళ్ళారి రాఘవాచార్యులు ద్వారా నాటకరంగంలో ప్రవేశించి హెచ్‌ఎల్‌ఎన్‌ నాటక సంస్థలో నటించారు.

ఆ తరువాత సొంతంగా ఓ నాటకం కంపనీ కూడా మొదలుపెట్టారు. సినిమాలలో కంటే రంగస్థలంలోనే ఆమె ఎక్కువ కాలం పని చేశారు. ఆమె మరణ వార్త తెలుసుకున్న సినీ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆమె మనవడు సింగపూర్‌లో నివసిస్తున్నారు. అతడు రాగానే అంత్యక్రియలు నిర్వహించనున్నారు. 

click me!