సౌత్ సినిమాలో మరో హాలీవుడ్ స్టార్

Published : Sep 03, 2019, 02:55 PM IST
సౌత్ సినిమాలో మరో హాలీవుడ్ స్టార్

సారాంశం

ఇండియన్ సిల్వర్ స్క్రీన్ పై కనిపించడానికి ఈ మధ్య హాలీవుడ్ తారలు తెగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. అవకాశం వస్తే కచ్చితంగా భారత సినిమాల్లో నటిస్తామని చెబుతూ వస్తున్నారు. ఇక మరికొంత మంది అయితే ఏ మాత్రం నో చెప్పకుండా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.

అనుష్క నటిస్తున్న సైలెన్స్ సినిమాలో కూడా మైకేల్ అనే హాలీవుడ్ యాక్టర్ నటిస్తున్న విషయం తెలిసిందే, ఇక ఇప్పుడు ధనుష్ కథానాయకుడిగా నటించబోయే ఒక డిఫరెంట్ సినిమాలో హాలీవుడ్ సీనియర్ యాక్టర్ జేమ్స్ కాస్మో సౌత్ లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. సూపర్ స్టార్ రాజినీకాంత్ పేట సినిమాకు దర్శకత్వం వహించిన యువ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజన్ ధనుష్ కొత్త ప్రాజెక్ట్ ని తెరకెక్కించనున్నాడు. 

జేమ్స్ కాస్మో హాలీవుడ్ లో  బ్రేవ్ హార్ట్ – ట్రాయ్ వంటి బిగ్గెస్ట్  హాలీవుడ్ సినిమాల్లో నటించారు. అలాగే వరల్డ్ వైడ్ గా హిట్టయిన గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో కూడా ముఖ్య పాత్రలో కనిపించారు. ఇక ఇప్పుడు ధనుష్ సినిమాలో నటించడానికి ఒప్పుకున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా వివరణ ఇచ్చింది. వై నాట్ స్టూడియోస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. 

PREV
click me!

Recommended Stories

మన శంకర వరప్రసాద్ గారు మూవీపై కొరటాల శివ ఫస్ట్ రియాక్షన్..హిట్ టాక్ రాగానే ఆచార్య డైరెక్టర్ ఏమన్నారంటే
Illu Illalu Pillalu Today Episode Jan 23: విశ్వ‌క్‌కు షాకిచ్చిన అమూల్య.. మరొక ప్లాన్‌తో పెళ్లి చెడగొట్టేందుకు రెడీ