
చైల్డ్ ఆర్టిస్ట్ గా కెరీర్ మొదలు పెట్టిన రాశి స్టార్ హీరోయిన్ అయ్యారు. తెలుగుతో పాటు పలు భాషల్లో నటించారు. ఒక దశలో బిజీ హీరోయిన్ గా పదుల సంఖ్యలో చిత్రాలు చేసింది. ప్రస్తుతం ఆమె సీరియల్స్ చేస్తున్నారు. జానకి కలగనలేదు సీరియల్ లో హుందాతనంతో కూడా అత్తయ్య పాత్ర చేస్తుంది. జానకి కలగనలేదు చివరి దశకు వచ్చినట్లు సమాచారం. దీంతో రాశి ఓ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నారు.
రాశి తనకు శోభన్ బాబు, చిరంజీవి అంటే చాలా ఇష్టం అన్నారు. తర్వాత రాశికి బాగా నచ్చిన హీరో ప్రభాస్ అట. ఈ జనరేషన్ స్టార్స్ లో ప్రభాస్ అంటే నాకు చాలా ఇష్టం. అవకాశం వస్తే ఆయనతో నటించాలని ఉంది. అయితే తల్లి వంటి పాత్ర మాత్రం చేయను, అన్నారు. ప్రభాస్ ని నేనెప్పుడూ కలవలేదు. అడవి రాముడు మూవీ సమయంలో నేను ఉన్న హోటల్ లోనే ఆయన కూడా ఉన్నారు. ఫోన్ చేసి మాట్లాడే ప్రయత్నం చేశాను, అని రాశి చెప్పుకొచ్చారు.
ప్రభాస్ కి తల్లిగా మాత్రం నటించనని రాశి చెప్పడం ఆసక్తి కలిగిస్తుంది. రాశి చివరిగా లంక అనే చిత్రంలో నటించారు. ఇది సైకలాజికల్ థ్రిల్లర్. ఆమె ప్రధాన పాత్ర చేశారు. లంక చిత్రానికి నిర్మాత కూడా ఆమె అని సమాచారం. లంక ఆశించిన స్థాయిలో ఆడలేదు. రాశి శ్రీముని అనే వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నారు.