పవిత్రతో రిలేషన్‌పై ట్రోలింగ్.. పిచ్చిరాతలు : ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించిన వీకే నరేష్

Siva Kodati |  
Published : Feb 17, 2023, 06:55 PM ISTUpdated : Feb 17, 2023, 07:25 PM IST
పవిత్రతో రిలేషన్‌పై ట్రోలింగ్.. పిచ్చిరాతలు : ఆధారాలతో సహా పోలీసులను ఆశ్రయించిన వీకే నరేష్

సారాంశం

పవిత్రా లోకేష్‌తో తన బంధంపై ట్రోలింగ్ చేస్తున్న వారిపై సినీనటుడు వీకే నరేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించిన అన్ని ఆధారాలను ఆయన అధికారులకు సమర్పించారు. 

సినీనటుడు వీకే నరేష్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించారు. పవిత్ర, తనపై సొషల్ మీడియా పోస్టింగ్‌‌లకు సంబంధించి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారానికి సంబంధించి ఇప్పటికే గతంలో ఒకసారి ఫిర్యాదు చేశారు నరేశ్. కొంతమంది కావాలనే తమపై తప్పుడు పోస్టింగ్‌లు పెడుతున్నారని నరేష్ ఆరోపించారు. దీనికి సంబంధించి సోషల్ మీడియా పోస్టింగ్‌లు, ట్రోలింగ్స్‌ స్క్రీన్ షాట్లను పోలీసులకు సమర్పించారు నరేష్.  

కాగా.. తాను, నరేశ్‌లకు చెందిన ఫోటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి అసభ్యకర పోస్టులు పెడుతున్నారంటూ సినీ నటి పవిత్రా లోకేష్ గతేడాది నవంబర్ 27న సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించడం టాలీవుడ్‌లో కలకలం రేపింది. కొన్ని వెబ్‌సైట్లు, యూట్యూబ్ ఛానెల్స్ పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దీనిలో భాగంగా 15 యూట్యూబ్ ఛానెల్స్, వెబ్‌సైట్స్‌కు నోటీసులు జారీ చేశారు. మూడ్రోజుల్లోపు విచారణకు హాజరుకావాలని ఆ సైట్ల నిర్వాహకులను ఆదేశించారు. 

Also REad: ఆస్తి కోసం నన్నే చంపాలనుకుంది.. నా కొడుకు రమ్య దగ్గరొద్దు : కోర్టులో నరేష్ పిటిషన్

ఆ మరుసటి రోజే నరేష్ భార్య రమ్య రఘుపతిపైనా పవిత్రా లోకేష్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రమ్య, నరేష్‌ల మధ్య కుటుంబ వివాదాలు ఉన్నాయని చెప్పారు. రమ్య రఘుపతికి ఇప్పటికే పలు క్రిమినల్ కేసుల్లో జోక్యం ఉందన్నారు. తన వ్యక్తిగత జీవితంపై అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని .. నరేష్, తనపై అభ్యంతరకరమైన వీడియోలు తయారుచేసి పోస్టు చేస్తున్నారని ఆమె ఫిర్యాదులో తెలిపారు. కొన్ని యూట్యూబ్ చానళ్లను అడ్డం పెట్టుకుని తనను కించపరుస్తున్నారని ఆరోపించారు. అభ్యంతరకర వీడియోలు పోస్టు చేస్తున్న యూట్యుబ్ చానళ్ల వెనక రమ్య రఘుపతి హస్తం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. గతంలో కూడా రమ్య రఘుపతి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించిందని తెలిపారు.

ఇదిలావుండగా.. డిసెంబర్‌ 31న తమ మ్యారేజ్‌ని అనౌన్స్ చేశారు నరేష్-పవిత్రా లోకేష్. `వెల్‌ కమ్‌ టూ అవర్‌ వరల్డ్` అంటూ ఓ వీడియోని సోషల్‌ మీడియాలో పోస్ట్ చేశారు నరేష్‌. క్యాండిన్ లైట్ల మధ్యలో కేక్‌ పెట్టి కట్‌ చేసుకుని ఒకరి ఒకరు కేక్‌ తినిపించుకున్నారు. అంతటితో ఆగలేదు, ఏకంగా ఇద్దరూ లిప్‌ కిస్‌ పెట్టుకోవడం విశేషం. ఇదే ఇక్కడ పెద్ద హాట్‌ టాపిక్‌ అవుతుంది. లేట్‌ వయసులో ఇంతటి ఘాటు ముద్దుతో తమ పెళ్లిని ప్రకటించడంతో ఇది నెట్టింట రచ్చ లేపుతుంది. 
 

PREV
click me!

Recommended Stories

ఆలియా భట్ అదిరిపోయే హెయిర్ స్టైల్స్ , ఈ 5 లుక్స్ ట్రై చేశారా ?
Bigg Boss 9 Remuneration పేదలకు పంచి పెట్టిన ఫైర్ బ్రాండ్ కంటెస్టెంట్, నెటిజన్లు ఏమంటున్నారంటే?