షూటింగ్ సెట్ లో  పడిపోయిన సీనియర్ హీరో!

Published : Dec 21, 2020, 02:05 PM IST
షూటింగ్ సెట్ లో  పడిపోయిన సీనియర్ హీరో!

సారాంశం

షూటింగ్ పాల్గొన్న మిథున్ అకస్మాత్తుగా పడిపోవడంతో చిత్ర యూనిన్ మొత్తం షాక్ అయ్యారట. ఆయన్ని వెంటనే ఆసుపత్రికి తరలించారని సమాచారం . మిథున్ కడుపు నొప్పికి కారణం ఫుడ్ పాయిజన్ అని తెలుస్తుంది. మిథున్ చక్రవర్తిని  టెస్ట్ చేసిన డాక్టర్స్ ఇదే చెప్పారట.   

 
అయితే మిథున్ చక్రవర్తి అంత పెయిన్ లో కూడా షూటింగ్ పూర్తి చేశారట. ఈ విషయాన్ని ది కాశ్మీరీ ఫైల్స్ దర్శకుడు వివేక్ అగ్నిహోత్రి తెలియజేశారు. స్టమక్ పెయిన్ తో బాధపడుతున్న మిథున్ తన బాధను అణచుకోని షూటింగ్ పూర్తి చేశారట. ఈ విషయాన్ని దర్శకుడు సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు. 
 
ఇక మిథున్ చక్రవర్తి చేసిన సాహసానికి దర్శకుడు ఫిదా అయ్యాడు. తీవ్రమైన కడుపు నొప్పితో బాధపడుతూ కూడా షూటింగ్ పూర్తి చేసిన హాస్పిటల్ కి వెళ్లినట్లు చెప్పాడు. ఒకప్పుడు స్టార్ హీరోగా అనేక సినిమాలు చేసిన మిథున్ ప్రస్తుతం వయసుకు దగ్గ పాత్రలు చేస్తున్నారు. అజయ్ దేవ్ గణ్ హీరోగా తెరకెక్కిన గోల్ మాల్ మూవీలో మిథున్ పాత్ర చాలా ఫేమస్ అయ్యింది. 

PREV
click me!

Recommended Stories

భార్యతో విడాకుల రూమర్స్ ? స్టార్ డైరెక్టర్ ఎమోషనల్ పోస్ట్ వైరల్
Deepika Padukone: పదేళ్లు పూర్తి చేసుకున్న దీపికా పదుకొణె హిస్టారికల్ మూవీ.. ఆమె బెస్ట్ లుక్స్ చూశారా