మారుతిరావు,అమృత ల కథే మా సినిమా

By Surya PrakashFirst Published Mar 12, 2020, 12:50 PM IST
Highlights

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో అప్పుడే సినిమా తయారయ్యి, రిలీజ్ కాబోతోందా అంటే అవుననే చెప్పాలి. అలాగే పోస్టర్స్ వేసి ప్రమోట్ చేస్తున్నారు దర్శక,నిర్మాతలు. 


తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో అప్పుడే సినిమా తయారయ్యి, రిలీజ్ కాబోతోందా అంటే అవుననే చెప్పాలి. అలాగే పోస్టర్స్ వేసి ప్రమోట్ చేస్తున్నారు దర్శక,నిర్మాతలు. ప్రెస్ మీట్ లలో ఈ సినిమా అమృత,ప్రణయ్ ప్రేమ కథ ఆధారంగా రూపొందించామని చెప్పటమే కాకుండా, పోస్టర్ పై మారుతీరావు పాత్రలో బెనర్జీ నటించారని అంటున్నారు. అయితే ఇందులో నిజమెంత ఉందనేది రిలీజ్ అయ్యాక చూస్తే కానీ తెలియదు. ఇంతకీ ఈ సినిమా పేరు ఏమిటీ అంటే  ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’.

సీనియర్ న‌టి అన్నపూర్ణమ్మ ప్రధాన పాత్రలో, జమున కీలక పాత్రలో రూపొందిన చిత్రం ‘అన్నపూర్ణమ్మగారి మనవడు’. ఈ చిత్రంలో మాస్టర్‌ రవితేజ టైటిల్‌ రోల్‌ పోషించారు. నర్రా శివనాగేశ్వర్‌ రావు (శివనాగు) దర్శకత్వంలో యం.ఎన్‌.ఆర్‌ ఫిలిమ్స్‌ పతాకంపై యం.ఎన్‌.ఆర్‌ చౌదరి నిర్మించారు. ప్ర‌స్తుతం సెన్సార్ కార్య‌క్ర‌మాలు పూర్తి చేసుకుని క్లీన్‌ యు సర్టిఫికెట్ పొందిన ఈ చిత్రం మార్చి 20న విడుద‌ల‌కు సిద్దం అవుతుంది.అమృత, ప్రణయ్‌ ఘటన స్ఫూర్తితో బాలాదిత్య, అర్చనపై తెరకెక్కించిన ప్రేమకథ ఆకట్టుకుంటుంద‌ని తెలియ‌జేసింది చిత్ర యూనిట్‌. 

బాలాదిత్య మాట్లాడుతూ... తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ప్రణయ్, అమృత ప్రేమకథ స్పూర్తితో దర్శకుడు శివనాగు మా క్యారెక్టర్స్ క్రియేట్ చేశారు. పూర్తి సినిమాటిక్‌గా చిత్రీకరించారు. అర్చన నాకు జంటగా నటించారు. మా ఇద్దరి మధ్య ఓ డ్యూయెట్ ఉంది. మార్చి 15న ఆ పాటను విడుదల చేయనున్నారు. సెకండాఫ్‌లో కనిపిస్తాను. పాత్ర నిడివి తక్కువైనా సినిమా మొత్తం నా చుట్టూనే తిరుగుతుంది. ఈ పాత్ర నటుడిగా నాకు మంచి గుర్తింపును తెస్తుందనే నమ్మకముంది. పాపులారిటీ ఉన్న వ్యక్తుల బయోపిక్‌లో నటిస్తే వారిగురించి నటించే ముందు మొత్తం తెలుసుకుంటాం. కానీ ఈ సినిమాలో నటించిన తర్వాత ప్రణయ్ గురించి కొన్ని విషయాలు తెలిసాయి అన్నారు.
 

click me!