అప్పట్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది.. సీనియర్ నటి!

Published : Aug 27, 2018, 12:07 PM ISTUpdated : Sep 09, 2018, 01:05 PM IST
అప్పట్లో కూడా కాస్టింగ్ కౌచ్ ఉంది.. సీనియర్ నటి!

సారాంశం

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కాస్టింగ్ కౌచ్ వివాదాలు ఎక్కువయ్యాయి. ఏ హీరోయిన్ మీడియా ముందుకొస్తున్నా.. ఆమెకు ముందుగా ఎదురయ్యే ప్రశ్న కాస్టింగ్ కౌచ్ గురించే.. చాలా మంది హీరోయిన్లు ఈ విషయంపై స్పందించారు

ప్రస్తుతం తెలుగు, తమిళ భాషల్లో కాస్టింగ్ కౌచ్ వివాదాలు ఎక్కువయ్యాయి. ఏ హీరోయిన్ మీడియా ముందుకొస్తున్నా.. ఆమెకు ముందుగా ఎదురయ్యే ప్రశ్న కాస్టింగ్ కౌచ్ గురించే.. చాలా మంది హీరోయిన్లు ఈ విషయంపై స్పందించారు. తాజాగా సీనియర్ హీరోయిన్ మీనా కూడా ఈ విషయంపై మాట్లాడారు. ''కాస్టింగ్ కౌచ్ అనేది విచారకరమైన విషయం. అన్ని రంగాల్లో మహిళలకు సమస్యలుంటాయి.

అలాంటి పరిస్థితులు నేను ఎదుర్కోకపోయినా.. మా కాలంలో కూడా ఈ టార్చర్ ఉండేది. వక్రబుద్ధి గల మగాళ్లు ఇప్పటికైనా మారాలి. ఒక మహిళతో ఇలాంటి డీల్ మాట్లాడేప్పుడు వారికి కూడా భార్యాబిడ్డలున్నారని గుర్తు చేసుకోవాలి'' అంటూ వెల్లడించారు. దాదాపు స్టార్ హీరోలందరితో కలిసి నటించిన మీనా.. అరవింద్ స్వామితో కలిసి నటించలేకపోయానని చెప్పుకొచ్చింది.

ఆయనతో కలిసి నటించే ఛాన్స్ వచ్చినా.. కాల్షీట్స్ సమస్య కారణంగా ఆ అవకాశాన్ని మిస్ చేసుకున్నానని చెప్పుకొచ్చింది. కాల్షీట్స్ కారణంగా వదులుకున్న సినిమాల లిస్ట్ చాలా పెద్దదని ఒక్కో సినిమా గురించి ప్రస్తావించింది.  

PREV
click me!

Recommended Stories

ఈ హీరోయిన్ నటించిన 4 సినిమాలు డిజాస్టర్లు.. కానీ పేరేమో మరో సావిత్రి
IMDb రేటింగ్ ప్రకారం 2025 లో టాప్ 10 సినిమాలు, సౌత్ సినిమాల ముందు తలవంచిన బాలీవుడ్