నటి ఖుష్బు ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌..

Published : Jul 20, 2021, 02:57 PM IST
నటి ఖుష్బు ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌..

సారాంశం

సీనియర్‌ నటి, బీజేపీ నాయకురాలు ఖుష్బు సుందర్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ కి గురయ్యింది. మూడు రోజులుగా హ్యాకింగ్‌ అయ్యిందని నటి ఖుష్బు వెల్లడించారు.

సీనియర్‌ నటి ఖుష్బు సుందర్‌ ట్విట్టర్‌ మరోసారి హ్యాకింగ్‌కి గురయ్యింది. ఈ సారి హ్యాకర్లు ఆమె అకౌంట్‌ పేరుని `బ్రియాన్‌`గా మార్చారు. కవర్‌ ఫోటోని సైతం మార్చేశారు. గతంలో ఆమె చేసిన ట్విట్లని తొలగించారు. తన ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్టు ఖుష్బు సుందర్‌ ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా వెల్లడించింది. మూడు రోజులుగా తన అకౌంట్ హ్యాక్‌కి గురయ్యిందని, 48 గంటల నుంచి తాను పాస్‌వర్డ్ మార్చడానికి ప్రయత్నిస్తున్నానని, కానీ సాధ్యం కావడం లేదని తెలియజేస్తూ, తనకు సహాయం చేయాలని అభిమానులను కోరింది ఖష్బు. 

ఈ విషయాన్ని ట్విట్టర్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీస్‌కి తీసుకెళ్లేందుకు ప్రయత్నిస్తున్నాం. ఈ మూడు రోజులు పెట్టిన పోస్టులు నావి కావు. గమనించగలరు` అని తెలిపింది. ఇదిలా ఉంటే గతేడాది ఏప్రిల్‌ళోనూ ఖుష్బు ట్విట్టర్‌ అకౌంట్‌ హ్యాక్‌కి గురయ్యింది. ఇప్పుడు ఆమె పేరుతోనే ట్విట్టర్‌ అకౌంట్‌ కనిపిస్తుంది. కవర్‌ పేజ్‌లో ఎలాంటి పోస్టర్‌ లేవు. అయితే ఇది సెట్‌ అయ్యిందా లేదా? అన్నది ఆమె నిర్ధారించాల్సి ఉంది.

నటిగా, రాజకీయ నాయకురాలిగా బిజీగా ఉంది ఖుష్బు. బీజేపీలో ఆమె యాక్టివ్‌ లీడర్‌గా ఉన్నారు. మరోవైపు రజనీకాంత్‌ హీరోగా రూపొందుతున్న `అన్నాత్తే` చిత్రంలో కీలక పాత్ర పోషిస్తుంది ఖుష్బు.

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా