పవన్ డ్యూయిల్ రోల్..ఒకటి యాక్షన్, రెండోది ఫన్

By Surya Prakash  |  First Published May 26, 2021, 8:30 AM IST

 కాలేజీ లెక్చరర్ గా ఫన్ గా, ఐబీ ఆఫీసర్ గా యాక్షన్ మోడ్ లో ఉంటారట. అయితే వీళ్లిద్దరు అన్నదమ్ములా ,వేర్వేరు వ్యక్తులా అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ  సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో కాలేజ్ సెట్ వేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. 


 పవన్ కళ్యాణ్.. హరీష్ శంకర్ దర్శకత్వంలో త్వరలో ఓ మూవీ చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన అఫీషియల్ ప్రకటన కూడా వచ్చేసింది. ఈ చిత్రాన్ని హరీష్ శంకర్ సమకాలీన రాజకీయాల అంశాలతో పాటు దేశభక్తి నేపథ్యంలో ఈ చిత్రం తెరకెక్కనుందనే విషయం క్లారిటీ వచ్చేసింది. అంతేకాదు ఈ సినిమాలో డైలాగ్స్, సన్నివేశాలు పవన్ కళ్యాణ్ రాజకీయ జీవితానికి ఉపయోగపడేలా ఈ సినిమా స్క్రిప్ట్‌ను హరీష్ శంకర్ తీర్చిదిద్దినట్టు సమాచారం.  ఈ నేపధ్యంలో ఈ సినిమాలో పాత్రల గురించి  వార్త బయిటకు వచ్చి అభిమానులను ఆనందపరుస్తోంది. 

మీడియా వర్గాల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఈ సినిమాలో పవన్ కళ్యాణ్  కాలేజీ లెక్చరర్ గానూ, ఇంటిలిజెన్స్ బ్యూరో ఆఫీసర్ గానూ కనిపించనున్నారు. కాలేజీ లెక్చరర్ గా ఫన్ గా, ఐబీ ఆఫీసర్ గా యాక్షన్ మోడ్ లో ఉంటారట. అయితే వీళ్లిద్దరు అన్నదమ్ములా ,వేర్వేరు వ్యక్తులా అనే విషయం మాత్రం తెలియరాలేదు. ఈ  సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి నేతృత్వంలో కాలేజ్ సెట్ వేయనున్నారు. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది. జూలై నుంచి ఈ సినిమా సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు.  ఇదే ఏడాదిలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా హరీష్ ప్లాన్ చేస్తున్నాడట.
 
 పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ రీసెంట్ గా రిలీజైన వకీల్ సాబ్ సినిమా భారీగా సక్సెస్ అవ్వటంతో మంచి ఉత్సాహంగా ఉన్నారు. అలాగే ‘అయ్యప్పనుమ్ కోషియం’  రీమేక్ ను స్టార్ట్ చేసారు. ఈ సినిమాలో మరో హీరోగా రానా నటిస్తున్నాడు. ఈ సినిమా తో పాటు క్రిష్ కొంత భాగం షూటింగ్ జరిగింది.   ‘హరి హర వీరమల్లు’ సినిమాను ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో దేశ వ్యాప్తంగా సంక్రాంతి కానుకగా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. కానీ ఈ సినిమా వచ్చే యేడాది సమ్మర్‌లో విడుదలయ్యే అవకాశాలున్నాయి.
 

Latest Videos

click me!