
ప్రతి విషయంలో వ్యంగ్యం ఎత్తుక్కోవడం దర్శకుడు వర్మకు అలవాటు. ట్రెండీ టాపిక్స్ పై వరుస ట్వీట్స్ వేస్తూ జనాల దృష్టిని ఆకర్షిస్తూ ఉంటారు. ఆయన అభిమానులకు వర్మ చర్యలు అబ్బురపరుస్తూ ఉంటాయి, యాంటీ ఫ్యాన్స్ మాత్రం విమర్శల దాడికి దిగుతూ ఉంటారు. గత రెండు నెలలుగా కరోనా సెకండ్ వేవ్ దేశాన్ని అతలాకుతలం చేస్తుంది. రోజుకు లక్షల్లో కరోనా బారినపడుతుండగా వేల మంది మరణిస్తున్నారు.
మనుషుల ప్రాణాలు తీస్తున్న కరోనా వైరస్ ని ఉద్దేశిస్తూ వర్మ ఓ ట్వీట్ వేశారు. ఈ లోకంలో ప్రతి సృష్టికి కారణం దేవుడు అయినప్పుడు, కరోనాను సృష్టించింది కూడా దేవుడే. కరోనా రూపంలో మనకు అయినవారి ప్రాణాలు బలిగొంటున్న దేవుడ్నిని ఎలా పూజిస్తారని లాజిక్ మాట్లాడాడు వర్మ. వర్మ చేసిన ఈ ట్వీట్ ప్రస్తుతం వైరల్ గా మారింది.
నాస్తికుడు అయినవర్మ దేవుడిని అస్సలు నమ్మడు. పుణ్య, పాప ప్రేమేయాలు ఏమి ఉండవు అని భావిస్తాడు. సొసైటీని, కుటుంబాన్ని పట్టించుకోని వర్మ తనకు ఎటువంటి ఎమోషన్స్ ఉండవని చెబుతారు. దీనితో కరోనా మరణాలపై దేవుడ్ని నిందిస్తూ ట్వీట్ చేశాడు.