టాలెంటెడ్ డైరెక్టర్.. ఆరేళ్ళ తరువాత కూడా నిరాశపరిచాడు!

By Prashanth MFirst Published Jun 3, 2019, 12:30 PM IST
Highlights

కోలీవుడ్ లో ఒకప్పుడు సెల్వా రాఘవన్ అంటే జనాలు పిచ్చెక్కిపోయేవారు. కేవలం కాదల్ కొండ్రెన్ (తెలుగులో నేను) సినిమాతో మనోడి పేరు జనాలకు బాగా ఎక్కేసింది. అయితే 2013లో వర్ణ సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ఆరేళ్ళ అనంతరం NGK సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

కోలీవుడ్ లో ఒకప్పుడు సెల్వా రాఘవన్ అంటే జనాలు పిచ్చెక్కిపోయేవారు. కేవలం కాదల్ కొండ్రెన్ (తెలుగులో నేను) సినిమాతో మనోడి పేరు జనాలకు బాగా ఎక్కేసింది. అయితే 2013లో వర్ణ సినిమాతో డిజాస్టర్ అందుకున్న ఈ దర్శకుడు ఆరేళ్ళ అనంతరం NGK సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 

అంతకుముందు యూత్ కి కనెక్ట్ అయ్యేలా సినిమాలు చేసి బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకున్న సెల్వ రాఘవన్ ఇప్పుడు అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోతున్నాడు.  అప్పట్లో 7/G బృందావన కాలనీతో టాలీవుడ్ యూత్ కి కూడా సెల్వ రాఘవన్ కనెక్ట్ అయ్యాడు. 

తెలుగు  జనాల కోసం శ్రీ రాఘవ అని ఒక తెలుగు టైటిల్ కార్డు సెట్ చేసుకున్నాడు. ఆడవారి మాటలకు అర్థాలే వేరులే సినిమాతో ఈ దర్శకుడు దశ మారింది. ఎమోషన్స్ తోనే మనసును కదిలించగలడని ఒక బ్రాండ్ సెట్ చేసుకున్నాడు. అయితే ఆ తరువాత తన స్టైల్ ని పూర్తిగా మార్చాడు. 

కార్తీ తో చేసిన మొదటి సినిమా ఆయిరతి ఒరువన్ (యుగానికి ఒక్కడు) తమిళ్ లో అంతగా ఆడకపోయినా తెలుగులో మాత్రం కాసుల వర్షాన్ని కురిపించింది. ఇక ఆ తరువాత శ్రీ రాఘవకి స్పెషల్ ఇమేజ్ ఏర్పడింది. అనంతరం ఎవరు ఊహించని లవ్ స్టోరీ ఈరంధం ఉలగమ్(వర్ణ) సినిమాను తెరకెక్కించాడు. ఆ సినిమా అయితే దారుణమైన నష్టాలను కలిగించింది. 

ఇక ఆ తరువాత మళ్ళీ సినిమాలు చేయనని స్టేట్మెంట్ ఇచ్చిన శ్రీ రాఘవ శింబు - త్రిషలతో కలిసి ఒక ప్రాజెక్ట్ సెట్ చేసుకున్నప్పటికీ ఆర్థిక ఇబ్బందులతో ఆ సినిమా అటకెక్కింది. ఫైనల్ గా సూర్య నమ్మి శ్రీ రాఘవకి అఫర్ ఇస్తే.. ఈ అవకాశాన్ని కూడా శ్రీ రాఘవ సరిగ్గా యూజ్ చేసుకోలేక మరో ప్లాప్ అందుకున్నాడు. 2010లో యుగానికి ఒక్కడు తరువాత మరో హిట్ అందుకొని శ్రీ రాఘవ నెక్స్ట్ ఎలాంటి సినిమాతో హిట్ అందుకుంటాడో చూడాలి.

click me!