బాలయ్య కథనే కొద్దిగా మార్చితే 'సరిలేరు నీకెవ్వరు'..?

Published : Jun 03, 2019, 12:28 PM IST
బాలయ్య కథనే కొద్దిగా మార్చితే  'సరిలేరు నీకెవ్వరు'..?

సారాంశం

మొదట్లో ఓ హీరోతో అనకున్న కథను రకరకాల కారణాలతో  వేరో హీరోతో చెయ్యటం ఇండస్ట్రీలో  సహజమే. 

మొదట్లో ఓ హీరోతో అనకున్న కథను రకరకాల కారణాలతో  వేరో హీరోతో చెయ్యటం ఇండస్ట్రీలో  సహజమే. అలా చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్స్ అవటం..తర్వత మొదట కథ విన్న హీరో మంచి స్క్రిప్టు మిస్సయ్యానే అని బాధపడటం జరుగుతూంటుంది. అలాగే కొద్దికాలం క్రితం  బాలయ్యతో అనుకుని రెడీ చేసుకున్న స్క్రిప్టుని  ఇప్పుడు మహేష్ తో   'సరిలేరు నీకెవ్వరు'  గా మార్చి చేస్తున్నారట. 

గుర్తుందా గతంలో అనిల్.. బాలయ్య తో ఓ సినిమా చేస్తున్నాడు అని వార్తలు వచ్చాయి. బాలయ్య 100 వ సినిమా అనిల్ డైరెక్ట్ చేయబోతున్నాడని…దానికి ‘‘రామారావు గారు’’ అనే టైటిల్ కూడా పెట్టారని గాసిప్స్ హల్ చల్ చేసాయి. ఆ కథ బాలయ్యకు నచ్చినా.. బయోపిక్ ప్లానింగ్ , బోయపాటి సినిమా వంటి కారణాలతో   ఆ సినిమాను పక్కన పెట్టేశాడని అంతా అనుకున్నారు. ఇప్పుడు అనిల్ అదే కథనే కొద్దిగా మార్చి మహేష్ కు చెప్పాడని తెలుస్తుంది.

ఇక ఈ సినిమా ప్రారంభోత్సవ కార్యక్రమం సూపర్‌ స్టార్‌ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా ఈ రోజు ఉదయం ఘనంగా జరిపారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో సినీ ప్రముఖుల సమక్షంలో ఓపెనింగ్ ఈవెంట్‌ను నిర్వహించారు.

దిల్‌ రాజు, అనిల్‌ సుంకరలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్‌ సంగీతమందిస్తుండగా యంగ్ సెన్సేషన్‌ రష్మిక మందన్న మహేష్ సరసన హీరోయిన్‌గా నటిస్తున్నారు.ఈ సినిమాను 2020 సంక్రాంతి రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు చిత్రయూనిట్‌. 

PREV
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9 title Winner: నాగార్జున డైలాగ్‌తో చెప్పి మరీ కప్‌ కొట్టిన కళ్యాణ్‌, ఎమోషనల్‌ కామెంట్‌.. తనూజకే క్రెడిట్‌
Bigg Boss Telugu 9: రమ్య మోక్ష చేత అందరి ముందు క్షమాపణలు చెప్పించిన కళ్యాణ్‌.. పరువు పోయిందిగా