'7/G బృందావన కాలనీ' రీరిలీజ్ ట్రైలర్ చూసారా?మళ్లీ ఆ రోజుల్లోకి

Published : Sep 17, 2023, 06:45 AM IST
'7/G బృందావన కాలనీ' రీరిలీజ్ ట్రైలర్ చూసారా?మళ్లీ ఆ రోజుల్లోకి

సారాంశం

సెల్వరాఘన్ దర్శకత్వం వహించిన ఈ మూవీ యూత్‍ను తెగ ఆకట్టుకుంది. 2004లో 7/జీ రెయిన్‍బో కాలనీ పేరుతో తమిళంలో రిలీజ్ అయిన ఈ సినిమా.. 


రీరీలిజ్ ల ట్రెండ్ లో ఇప్పుడు  శ్రీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కిన కల్ట్ క్లాసిక్ మూవీ '7/G బృందావన కాలనీ' చేరుతోంది. ఈ చిత్రాన్ని వచ్చే వారం థియేటర్లలో రీరిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తాజాగా 4K ట్రైలర్ ను ఆవిష్కరించారు.  ఈ ట్రైలర్ కు ఓ రేంజిలో రెస్పాన్స్ వస్తోంది. చాలా మంది గతంలోకి వెళ్లిపోయామని కామెంట్స్ చేస్తున్నారు. మళ్లీ ఖచ్చితంగా థియేటర్ లో చూడాలని అంటున్నారు.

 తెలుగు తమిళ భాషల్లో ఘన విజయం సాధించి  కల్ట్ క్లాసిక్ లవ్ స్టోరీగా నిలిచిపోయిన   '7/G బృందావన కాలనీ' లో రవికృష్ణ, సోనియా అగర్వాల్‌ హీరో హీరోయిన్లుగా చేసారు. సెల్వరాఘన్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ 2004లో రిలీజ్  బాక్సాఫీస్ వద్ద కనక వర్షం కురిపించింది. సుమారు 19 సంవత్సరాల తర్వాత ఇప్పుడు మరోసారి తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేటర్లలోకి రానుంది. రీ-రిలీజ్ డేట్ కూడా ఫిక్స్ అయింది. సెప్టెంబర్ 22న తెలుగు రాష్ట్రాలతో పాటుగా వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా విడుదల చేయబోతున్నారు. 

ఈ చిత్రంలో బాధ్యతలు లేని యువకుడు రవి పాత్రలో రవికృష్ణ జీవించేశారు. తొలి సినిమాకే ఫిల్మ్ ఫేర్ అవార్డు అందుకున్నారు. యువన్ శంకర్ రాజా అందించిన సంగీతం కూడా 7/జీ బృందావన కాలనీకి పెద్ద బలంగా నిలిచింది. ఈ సినిమాలోని పాటలు ఎవర్‌గ్రీన్‍గా నిలిచిపోయాయి. అతడి కూడా ఈ చిత్రానికి ఫిల్మ్ ఫేర్ అవార్డు దక్కింది. దర్శకుడు సెల్వరాఘన్ ఈ విభిన్నమైన ప్రేమ కథను తెరకెక్కించిన తీరు అందరినీ ఆకట్టుకుంది. యదార్థ ఘటనల ఆధారంగా ఆయన ఈ సినిమా తీశారు. హీరోహీరోయిన్ల మధ్య ప్రేమలో సంఘర్షణను అద్భతంగా తెరకెక్కించారు. కొడుకుపై ఓ మధ్య తరగతి తండ్రి ఎలా ఆలోచిస్తారన్న అంశాన్ని కూడా భావోద్వేగంగా చూపారు.
 
'ఈ వయసులో సిగరెట్లు, బీర్లు, పోలీసులు..' అంటూ రవికృష్ణను చంద్రమోహన్ తిట్టే సన్నివేశంతో ఇప్పుడు ఈ '7/G బృందావన కాలనీ' రీరిలీజ్ ట్రైలర్ ప్రారంభమైంది. యూత్ ని ఆకట్టుకునే అంశాలు, సినిమాలో హైలైట్ గా నిలిచిన సీన్స్ తో ఫ్రెష్ ఫిలింగ్ ను కలిగించేలా చాలా ఇంట్రెస్టింగ్ గా ట్రైలర్ ను కట్ చేసారు. మనసుకు హత్తుకునే పాటలను గుర్తు చేయడమే కాదు, కొన్ని ఎమోషనల్ సన్నివేశాలతో కంటతడి పెట్టించారు.  

రవి కృష్ణ (Ravi Krishna), సోనియా అగర్వాల్‌ కెరీర్‌లో ల్యాండ్ మార్క్‌ సినిమాగా నిలిచిపోయింది. చంద్రమోహన్‌, విజయన్‌, సుమన్‌ శెట్టి, సుధ, మనోరమ ఇతర కీలక పాత్రల్లో నటించారు. ఈ చిత్రం తమిళంలో 7/G రెయిన్‌బో కాలనీ టైటిల్‌తో విడుదలైంది.

PREV
click me!

Recommended Stories

Emmanuel: కట్టే కాలే వరకు ఎంటర్‌టైన్‌ చేస్తా.. బిగ్‌ బాస్‌ మాటలకు ఇమ్మాన్యుయెల్‌ కన్నీటి పర్యంతం
Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?