'లక్ష్మీస్ ఎన్టీఆర్': వర్మకి సుప్రీం కోర్టు షాక్!

By Udaya DFirst Published Apr 1, 2019, 4:49 PM IST
Highlights

రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో విడుదల చేయడంపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీని వెనుక కుట్ర జరుగుతుందని వర్మ ఆరోపణలు చేశాడు.

రామ్ గోపాల్ వర్మ రూపొందించిన 'లక్ష్మీస్ ఎన్టీఆర్' సినిమా ఏపీలో విడుదల చేయడంపై హైకోర్టు స్టే విధించిన సంగతి తెలిసిందే. దీని వెనుక కుట్ర జరుగుతుందని వర్మ ఆరోపణలు చేశాడు.

హైకోర్టు నిర్ణయంపై తాము సుప్రీం కోర్టుకి వెళ్తామని కచ్చితంగా న్యాయం గెలుస్తుందని వర్మ అన్నారు. ఈ క్రమంలో చిత్రనిర్మాత రాకేశ్ రెడ్డి సోమవారం నాడు సుప్రీం కోర్టుని ఆశ్రయించారు. సినిమా విడుదలపై స్టే విధిస్తూ హైకోర్టు వెల్లడించిన నిర్ణయం పట్ల అత్యవసరం విచారణ చేపట్టాలని నిర్మాత తరఫు న్యాయవాది పిటిషన్ దాఖలు చేశారు.

అయితే ఈ పిటిషన్ ను సుప్రీం కోర్టు తోసిపుచ్చింది. దీనిపై అత్యవసర విచారణ చేపట్టలేమని కోర్టు తెలిపింది. హైకోర్టు న్యాయమూర్తులు సినిమా చూసేవరకు  ఆగలేకపోతున్నారా అంటూ నిర్మాత రాకేశ్ రెడ్డిపై బెంచ్ ఆగ్రహం వ్యక్తం చేసింది.

ఏప్రిల్ 3న హైకోర్టు నిర్ణయం వెల్లడించిన తరువాత పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని తెలిపింది. దీన్ని బట్టి చూస్తుంటే ఎన్నికలు పూర్తయ్యే వరకు ఏపీలో ఈ సినిమా రిలీజ్ అయ్యే దాఖలాలు కనిపించడం లేదు. 

click me!