పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సాయేషా

Published : Dec 14, 2016, 12:04 PM ISTUpdated : Mar 25, 2018, 11:37 PM IST
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన సాయేషా

సారాంశం

పవర్ స్టార్ సరసన ఛాన్స్ కొట్టేసిన అఖిల్ హీరోయిన్ అఖిల్ మూవీ తర్వాత ఏ సినిమాలో చేయని సాయేషా తాజాగా పవర్ స్టార్ సరసన ఆఫర్

అక్కినేని యువహీరో నాగార్జున, అమల గారాల పుత్రుడు అక్కినేని అఖిల్ వెండితెరపై ఆరంగేట్రం చేసిన తొలి చిత్రం ‘అఖిల్’. అఖిల్ చిత్రంలో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాయెషా సైగల్ ఆ చిత్రం తరువాత మరో అవకాశం అందుకోలేదు.

 

అయితే సాయేషా ఇప్పుడు టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ అందుకోబోతున్నట్లు సమాచారం అందుతోంది. తాజా సమాచారం ప్రకారం సాయెషా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సరసన నటించే అవకాశం కొట్టేసినట్లు తెలుస్తోంది.

 

తమిళ దర్శకుడు ఆర్ టి నేసన్ దర్శకత్వం లో పవన్ ఓ చిత్రం లో నటించనున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం లో సాయెషా అవకాశం దక్కించుకున్నట్లు తెలుస్తోంది. కానీ అధికారిక ప్రకటన చిత్ర టీం నుంచి రావలసి ఉంది. ఈ చిత్రం లో తెలుగు నటి రక్షిత పవన్ చెల్లెలి పాత్రలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రం తమిళం లో అజిత్ నటించిన వేదలమ్ రీమేక్ గా రాబోతోంది. ఏ. ఎమ్.రత్నం దీనికి నిర్మాత.

 

PREV
click me!

Recommended Stories

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే