సవ్యసాచి సెన్సార్ వర్క్ రిపోర్ట్!

Published : Oct 29, 2018, 03:47 PM ISTUpdated : Oct 29, 2018, 03:48 PM IST
సవ్యసాచి సెన్సార్ వర్క్ రిపోర్ట్!

సారాంశం

చాలా రోజుల తరువాత అక్కినేని హీరో నాగ చైతన్య ఒక డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన సవ్యసాచి నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే.

చాలా రోజుల తరువాత అక్కినేని హీరో నాగ చైతన్య ఒక డిఫరెంట్ స్టోరీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. దర్శకుడు చందు మొండేటి తెరకెక్కించిన సవ్యసాచి నవంబర్ 2న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ఓ వర్గం ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలున్నాయి. 

ఫస్ట్ డే టాక్ ను బట్టి సినిమా విజయం ఏ రేంజ్ లో ఉంటుందో ఒక అంచనాకు రావచ్చు. ఇకపోతే ప్రస్తుతం సినిమాకు సంబందించిన సెన్సార్ పనులు కూడా ఫినిష్ అయ్యాయి. యాక్షన్ అండ్ రొమాంటిక్ తరహాలో రానున్న ఈ సినిమాకు U/A సర్టిఫికెట్ ను జారీ చేశారు. సెన్సార్ యూనిట్ నుంచి కూడా చిత్ర యూనిట్ కు మంచి ప్రశంసలు అందినట్లు తెలుస్తోంది. 

ఎక్కువగా కట్స్ లేకుండా ప్రయోగాత్మకంగా తెరకెక్కిన ఈ సినిమా అందరికి నచ్చుతుందని అంటున్నారు. ఇక చైతు సరసన నిధి అగర్వాల్ హీరోయిన్ గా నటించగా మాధవన్ విలన్ గా నటించిన సంగతి తెలిసిందే. మైత్రి మూవీ మేకర్స్ నిర్మించిన ఈ సినిమాకు ఎమ్.ఎమ్.కీరవాణి సంగీతం అందించారు. 

PREV
click me!

Recommended Stories

Thanuja: కళ్యాణ్ పాడు చేసుకుంటున్నాడు, తనూజలో సడెన్ గా ఈ మార్పు దేనికోసం.. సూటిగా ప్రశ్నించిన అభిమాని
Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్