మెగా హీరో చిత్రంలో కట్టప్ప.. రోల్ ఏంటో తెలుసా!

Published : Jul 15, 2019, 12:04 PM IST
మెగా హీరో చిత్రంలో కట్టప్ప.. రోల్ ఏంటో తెలుసా!

సారాంశం

తమిళ నటుడు సత్యరాజ్ అద్భుతమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రతో సత్యరాజ్ కు ఇండియా మొత్తం గుర్తింపు లభించింది. 

తమిళ నటుడు సత్యరాజ్ అద్భుతమైన పాత్రల్లో నటిస్తూ మెప్పిస్తున్నాడు. బాహుబలి చిత్రంలో కట్టప్ప పాత్రతో సత్యరాజ్ కు ఇండియా మొత్తం గుర్తింపు లభించింది. తెలుగులో సత్యరాజ్ కు మరిన్ని అవకాశాలు దక్కుతున్నాయి. నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో దర్శకులు సత్యరాజ్ ని ఎంపిక చేసుకుంటున్నారు. 

ఇటీవల సత్యరాజ్ జెర్సీ చిత్రంలో కీలక పాత్రలో నటించారు. తాజాగా సాయిధరమ్ తేజ్ ఆసక్తికరమైన విషయాన్ని ప్రకటించాడు. నెక్స్ట్ మూవీ ' ప్రతి రోజు పండగే'లో సత్యరాజ్ తనకు తండ్రి పాత్రలో నటించబోతున్నట్లు సాయిధరమ్ తేజ్ సోషల్ మీడియాలో తెలిపాడు. 

సత్యరాజ్ చిత్ర పరిశ్రమలోకి వచ్చి 41 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా తేజు శుభాకాంక్షలు తెలియజేశాడు. ప్రతి రోజు పండగే చిత్రానికి మారుతి దర్శకుడు. చిత్రలహరి చిత్రంతో వరుస ప్లాపుల నుంచి తేజు గట్టెక్కాడు. ఆ చిత్రం మంచి విజయం సాధించింది. దీనితో ప్రతి రోజు పండగే చిత్రంపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. 

PREV
click me!

Recommended Stories

తనూజతో రొమాంటిక్ మూమెంట్స్, సంతోషంతో పొంగిపోయిన కళ్యాణ్.. సంజనకి ఓజీ రేంజ్ ఎలివేషన్
ఆ స్టార్ హీరో వల్ల కెరీర్ నాశనం చేసుకున్న భూమిక, నగ్మా, స్నేహ ఉల్లాల్.. లిస్టులో మొత్తం ఏడుగురు బాధితులు