సత్యదేవ్, తమన్నా తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ రీమేక్ మూవీ అందరి దృష్టిని ఆకర్షించింది.ఇది గమనించిన ట్రేడ్ ఆ సినిమాపై క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి రెడీ అయ్యింది. రీసెంట్ గా ఈ సినిమా శాటిలైట్,డిజిటల్ రైట్స్ పెద్ద మొత్తానికి అమ్ముడైనట్లు సమాచారం.
సినిమా హిట్, ఫ్లాఫ్ లకు సంభందం లేకుండా కెరీర్ లో ముందుకు వెళ్తున్నారు సత్యదేవ్. మీడియం బడ్జెట్ లో చేయాలనుకునే నిర్మాతలకు ఆయనో పెన్నిథిలా కనపడుతున్నారు. రీసెంట్ గా ‘తిమ్మరుసు’ సినిమాతో పలకరించిన సత్యదేవ్..ఆ సినిమాకు డీసెంట్ ఓపినింగ్స్ రప్పించుకోవటంలో సక్సెస్ అయ్యారు. దాంతో ఇప్పుడు ఆయన తదుపరి సినిమా ‘గుర్తుందా శీతాకాలం’కు సైతం ఓ రేంజిలో క్రేజ్ ఏర్పడింది. అందులోనూ సత్యదేవ్, తమన్నా తొలిసారి కలిసి నటిస్తుండటంతో ఈ రీమేక్ మూవీ అందరి దృష్టిని ఆకర్షించింది.ఇది గమనించిన ట్రేడ్ ఆ సినిమాపై క్రేజ్ ని క్యాష్ చేసుకోవటానికి రెడీ అయ్యింది. రీసెంట్ గా ఈ సినిమా శాటిలైట్,డిజిటల్ రైట్స్ పెద్ద మొత్తానికి అమ్ముడైనట్లు సమాచారం. ఎవరు కొన్నారు..ఎంతకు కొన్నారు వివరాల్లోకి వెళితే...
సత్యదేవ్, తమన్నా జంటగా నటిస్తున్న చిత్రం ‘గుర్తుందా శీతాకాలం’. కన్నడ చిత్రం ‘లవ్ మాక్‌టైల్’కు ఇది రీమేక్. నాగ శేఖర్ దర్శకుడు. భావన రవి, నాగశేఖర్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సత్యదేవ్ సరసన మరో హీరోయిన్ గా మేఘా ఆకాష్ చేసింది. ఈ సినిమాకు క్రేజ్ గమనించిన మ్యాంగో మీడియా రామ్..ఈ చిత్రం ఓటీటి, టీవి ఛానెల్ రైట్స్ ని ఐదు కోట్లకు సొంతం చేసుకున్నట్లు ట్రేడ్ వర్గాల సమాచారం. ఇప్పుడు ఆయన వాటిని టీవి ఛానెల్స్ కు, ఓటీటికు అమ్మి లాభం చేసుకోవచ్చు.
దర్శకుడు మాట్లాడుతూ.. ‘‘సాధారణంగా చాలా కథలు శీతాకాలంలోనే మొదలవుతాయి. అందుకే ఈ చిత్రాన్ని శీతాకాలంలోనే ప్రారంభించి షూట్ చేసాం. ఇందులో సత్యదేవ్‌తో ప్రయాణించే ఓ పాత్ర చాలా ప్రత్యేకమైనది. ఇప్పుడా క్యామియే పాత్రలో మేఘా నటించడం చాలా ఆనందంగా ఉంది. ఆమె పాత్ర చాలా అందంగా ఉంటుంది. త్వరలో మరిన్ని సర్‌ప్రైజ్‌లు చూస్తారు. చాలా మంచి ప్రేమకథని తెరకెక్కించాననే తృప్తి ఉంది’’అన్నారు.
సత్యదేవ్ మాట్లాడుతూ... గుర్తుందా శీతాకాలం చిత్రంలో నటించేందుకు నాకు అవకాశం ఇచ్చిన దర్శకనిర్మాత నాగశేఖర్ గారికి ప్రత్యేఖ కృతజ్ఞతలు, ఈ సినిమాలో నా పాత్ర చాలా ఎమోషనల్ గా ఉంటుంది. ఈ సినిమాలో హీరోయిన్ తమన్నాగారితో కలిసి నటించడం చాలా ఆనందంగా ఉంది. హ్యాపెనింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కాలభైరవ ఈ చిత్రానికి అద్భుతమైన ట్యాన్స్, నేపథ్య సంగీతాన్ని అందించారు. ఎప్పటికప్పుడు నన్ను ప్రొత్సహిస్తూ నా సినిమాల్ని హిట్ చేస్తున్న సినీ అభిమానులకు నా ప్రత్యేక కృతజ్ఞతలు, వారందరి అంచనాలకి ఏ మాత్రం తగ్గకుండా గుర్తుందా శీతాకాలం మూవీ ఉంటుందని నేను కచ్ఛితంగా చెప్పగలను. ఈ మూవీ ప్రేక్షకాదరణ తప్పకుండా పొందుతుందనే నమ్మకం ఉందన్నారు. ఈ చిత్రానికి సంగీతం: కాల భైరవ, కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: సత్య హెగ్డే.
‘గుర్తుందా శీతాకాలం’, ‘గాడ్సే’,‘స్కైలాబ్’ చిత్రాలతో బిజీ బిజీగా ఉన్నారు సత్యదేవ్. వీటితోపాటు మరికొన్ని కథల్ని వింటున్నారాయన. అక్షయ్ కుమార్ హీరోగా తెరకెక్కుతోన్న ‘రామ్ సేతు’ సినిమాతో బాలీవుడ్‌లో అడుగుపెట్టనున్నారు.