మూడేళ్లుగా ఆ వేధింపులు భరిస్తున్నా... ప్రియా ప్రకాష్ వారియర్ సంచలన కామెంట్స్

Published : Jul 31, 2021, 02:34 PM IST
మూడేళ్లుగా ఆ వేధింపులు భరిస్తున్నా... ప్రియా ప్రకాష్ వారియర్ సంచలన కామెంట్స్

సారాంశం

ఇష్క్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియా ప్రకాష్ సోషల్ మీడియా వేధింపులపై స్పందించారు. గత మూడేళ్ళుగా తాను వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించారు.  


హీరోయిన్ గా తెలుగులో బిజీ అవుతున్నారు యంగ్ బ్యూటీ ప్రియా ప్రకాష్ వారియర్. చెక్ మూవీలో నితిన్ కి జంటగా నటించిన ప్రియా ప్రకాష్, లేటెస్ట్ మూవీ ఇష్క్ లో యువ హీరో తేజా సజ్జాతో జత కట్టారు. ఈ వారం విడుదలైన ఇష్క్ పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇష్క్ మూవీ ప్రమోషన్స్ లో పాల్గొన్న ప్రియా ప్రకాష్ సోషల్ మీడియా వేధింపులపై స్పందించారు. గత మూడేళ్ళుగా తాను వేధింపులకు గురవుతున్నట్లు వెల్లడించారు.  


పబ్లిక్ ఫిగర్ అయినప్పటికీ మేము కూడా సాధారణ మనుషులమే అనే విషయం చాలా మంది మరచిపోతున్నారు. అందరిలాగే మా దిన చర్యలు ఉంటాయి. ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసే ప్రతి విషయంలో బాధ్యతగా ఉండాలని నేను అనుకోను, నేనైతే ఎటువంటి ముసుగులు లేకుండా సోషల్ మీడియాలో స్పందిస్తూ ఉంటాను. అలాగే ఇతరు కామెంట్స్ పట్టించుకుంటూ, మనల్ని మనం మార్చుకోవడం పొరపాటు. 


గత మూడేళ్ళుగా నేను సోషల్ మీడియా వేధింపులకు గురవుతున్నాను. నెటిజెన్స్ కామెంట్స్ నేను సీరియస్ గా తీసుకోవడం మానేశా. కేవలం పాజిటివ్ విషయాలు తీసుకొని, నెగిటివ్ విషయాలు వదిలేస్తా... అని ప్రియా ప్రకాష్ వారియర్ తెలిపారు. 2019లో విడుదలైన మలయాళ చిత్రం ఒరు ఆడార్ లవ్ తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ప్రియా ప్రకాష్, ఆ చిత్రంలోని ఓ సన్నివేశంలో కన్నుకొట్టే సన్నివేశంలో పాల్గొన్నారు. ఆ సీన్ లో ప్రియా ఎక్స్ ప్రెషన్స్ కి యూత్ పడిపోగా, నేషనల్ లెవెల్ లో పాప్యులర్ అయ్యింది. 
 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కమన్‌ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్