
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేష్ జంటగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారు వారి పాట. గీత గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకుడు. పోకిరి, దూకుడు తర్వాత మహేష్ నటిస్తున్న కంప్లీట్ మాస్ మూవీ ఇదే. ఇప్పటికే విడుదలైన ట్రైలర్ యూట్యూబ్ లో దూసుకుపోతోంది. మహేష్ బాబు ఫుల్ ఎనెర్జిటిక్ గా కామెడీ, మాస్ యాక్షన్ తో అదరగొడుతున్నారు. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా చిత్ర యూనిట్ జోరుగా కొనసాగిస్తోంది.
సినిమా రీచ్ ను పెంచేందుకు ఫ్యాన్స్, ఆడియెన్స్ కోసం సర్ ప్రైజింగ్ ఎలిమెంట్ ను రివీల్ చేశారు మేకర్స్. ట్విటర్ లో ఈ సినిమా హ్యాష్ ట్యాగ్ పై మహేశ్ బాబు స్పెషల్ ఎమోజీని తీసుకొచ్చారు. ఈ ఎమోజీ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. #SarkaruVaariPaata
#SVP #SVPMania ట్యాగ్ లతో సర్కారు వారి పాట చిత్రం ట్రెండింగ్ అవుతోంది. అయితే సూపర్ స్టార్ మహేశ్ బాబు సినిమాతోనే టాలీవుడ్ లో ఈ ట్రెండ్ కొనసాగడం విశేషం. మొత్తానికి టాలీవుడ్ లో సరికొత్త ట్రెండ్ సర్కారు వారి పాటతో స్టార్ట్ చేయడం పట్ల అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు.
తాజాగా ఈ చిత్ర ప్రీ రిలీజ్ ఈవెంట్ కి సంబంధించిన అప్డేట్ కూడా వచ్చేసింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ ని మే 7న నిర్వహించబోతున్నట్లు చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది. హైదరాబాద్ లోని యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్ లో సర్కారు వారి పాట ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించనున్నారు.
బ్యాకింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్నఈ చిత్రంలో హీరోహీరోయిన్లుగా సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేష్ నటించారు. పరశురామ్ పెట్ల దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్, 14 రీల్ బ్యానర్ పై నిర్మించిన ఈ చిత్రం కోసం అభిమానులు, ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు. మే 12 ఈ చిత్రం గ్రాండ్ గా రిలీజ్ కానుంది.