నా మాటలు సుశాంత్ నేర్పినవే: సారా అలీ ఖాన్

Published : Jun 24, 2020, 04:57 PM IST
నా మాటలు సుశాంత్ నేర్పినవే: సారా అలీ ఖాన్

సారాంశం

సుశాంత్ మరణం తరువాత సారా గతంలో మాట్లాడిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో `నేను ఆ సినిమాలో ఎలా చేశానో తెలియదు. నేను నిజంగా నా బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేశాను. కానీ సుశాంత్ లేకుండా నేను ఇంత బెస్ట్‌ ఇచ్చేదాన్ని కాదేమో. సుశాంత్‌ ఎంతో హెల్ప్‌ ఫుల్‌ పర్సన్‌` అంటూ చెప్పింది.

బాలీవుడ్‌ యువ నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్‌ మృతి నుంచి ఇండస్ట్రీ ఇంకా కోలుకోలేకపోతోంది. ఎంతో భవిష్యత్తు ఉన్న యువ నటుడు అర్ధాంతరంగా తనువు చాలించటంతో ఆయన జ్ఞాపకాలను తలుచుకుంటూ సినీ ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా హీరోయిన్‌ సారా అలీ ఖాన్‌ కూడా సుశాంత్ తో తన అనుబంధాన్ని గుర్తు చేసుకుంది. సారా అలీఖాన్‌ తొలి సినిమా కేథార్‌నాథ్ సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ హీరోగా నటించాడు. అయితే ఆ సినిమా సమయంలో సుశాంత్ తనకు ఎలా సాయం చేశాడో వివరించింది సాలా అలీ ఖాన్‌.

సుశాంత్ మరణం తరువాత సారా గతంలో మాట్లాడిన ఓ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. ఆ వీడియోలో `నేను ఆ సినిమాలో ఎలా చేశానో తెలియదు. నేను నిజంగా నా బెస్ట్ ఇచ్చేందుకు ట్రై చేశాను. కానీ సుశాంత్ లేకుండా నేను ఇంత బెస్ట్‌ ఇచ్చేదాన్ని కాదేమో. సుశాంత్‌ ఎంతో హెల్ప్‌ ఫుల్‌ పర్సన్‌` అంటూ చెప్పింది. అంతేకాదు సినిమా షూటింగ్ సమయంలో హిందీలో ఎలా మాట్లాడాలో కూడా నాకు సుశాంతే నేర్పించాడని చెప్పింది.

ఈ నెల 14న సుశాంత్ సింగ్‌ రాజ్‌పుత్ ముంబైలోని తన నివాసంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొని మరణించిన సంగతి తెలిసిందే. తన మృతికి కారణాలను సుశాంత్ వెల్లడించకపోయినా అవకాశాలు చేజారయన్న మనో వేదనతోనే ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా భావిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా బాలీవుడ్‌ ఇండస్ట్రీలో నెపోటిజంపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.

PREV
click me!

Recommended Stories

Demon Pavan Remuneration : 15 లక్షల జాక్ పాట్ తో పాటు, డిమాన్ పవన్ రెమ్యునరేషన్ టోటల్ గా ఎంతో తెలుసా?
Bigg Boss Telugu: ఈ విషయంలో అందరూ ఫెయిల్ అయ్యారు, బిగ్ బాస్ పై మండిపడ్డ రోహిణీ