వివాదంలో సినీ నిర్మాత.. ఇంటికొచ్చి దౌర్జన్యం చేశాడంటూ!

Published : Jun 24, 2020, 03:45 PM ISTUpdated : Jul 01, 2020, 10:32 AM IST
వివాదంలో సినీ నిర్మాత.. ఇంటికొచ్చి దౌర్జన్యం చేశాడంటూ!

సారాంశం

మంగళవారం పీవీపీ మా ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారు. మా ఇంట్లో ఏం చేయాలనేది మా ఇష్టం అని చెప్పడంతో.. బుధవారం ఉదయం 40 మందితో మా ఇంటి ముందుకొచ్చి దౌర్జన్యం చేశారు. ఇంటిపైకి వెళ్లి.. రూఫ్ టాప్ గార్డెన్‌ను కూల్చేయడం ప్రారంభించారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి అడ్డుకున్నారు. 

విజయవాడ వైసీపీ నేత, టాలీవుడ్ నిర్మాత పీవీపీ భూ వివాదంలో చిక్కుకున్నారు. హైదరాబాద్ బంజారాహిల్స్  లోని భూమి విషయంలో పీవీపీని బంజారాహిల్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.  వివరాల్లోకి వెళ్తే...  బంజారాహిల్స్ రోడ్డు నెంబర్ 14లో తన నివాసం పక్కనే కైలాష్ విక్రం అనే వ్యక్తి ఇంటిని నిర్మాణం చేస్తున్నాడు. పీవీపి అనుచరులం అని కొందరు తనపై దాడి చేశారని బంజారాహిల్స్ పోలీసు స్టేషన్ లో కైలాష్ ఫిర్యాదు చేశాడు. స్థలానికి సంబంధించిన పత్రాలు తనవద్ద ఉన్నాయని చెప్పినా వినకుండా దాడి చేశారని పోలీసులకు తెలిపాడు. 

‘‘రూఫ్ టాప్ గార్డెన్ కడితే కూల్చేస్తానని పీవీపీ వార్నింగ్ ఇచ్చారు. రెండేళ్ల క్రితమే ఇంటిని కొనుగోలు చేశాం. ఇటీవలే రిజిస్ట్రేషన్ పూర్తయ్యింది. ఆరు నెలల క్రితం ఫోన్లో బెదిరించారు. మంగళవారం పీవీపీ మా ఇంటికొచ్చి వార్నింగ్ ఇచ్చారు. మా ఇంట్లో ఏం చేయాలనేది మా ఇష్టం అని చెప్పడంతో.. బుధవారం ఉదయం 40 మందితో మా ఇంటి ముందుకొచ్చి దౌర్జన్యం చేశారు. ఇంటిపైకి వెళ్లి.. రూఫ్ టాప్ గార్డెన్‌ను కూల్చేయడం ప్రారంభించారు. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వారొచ్చి అడ్డుకున్నారు. ఆయన ఇల్లు మా ఇంటి వెనుక ఉంటుంది. ఆయన ఇల్లు సరిగా కనిపించదని పీవీపీ అంటున్నారు’’అని బాధితుడు మీడియాకు తెలిపారు.

అయితే స్థలానికి సంబంధించిన పత్రాలు తన వద్ద ఉన్నాయని అంటున్నారు పీవీపీ. ఈ నిర్మాణ విషయంలో ఇరు వర్గాల మధ్య విభేదాలు తలెత్తాయి. ఇద్దరిని బంజారాహిల్స్ స్టేషన్ లో పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వివాదానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

PREV
click me!

Recommended Stories

ఇండస్ట్రీ రికార్డులు బద్దలు కొట్టాల్సిన సినిమా, కానీ ఫ్లాప్..హీరోని తలుచుకుని రోజూ బాధపడే డైరెక్టర్ ఎవరంటే
Akhanda 2 Collections: అఖండ 2 మూవీ 10 రోజుల కలెక్షన్లు.. నెగటివ్‌ టాక్‌తోనూ క్రేజీ వసూళ్లు.. ఎంత నష్టమంటే