‘అమర్ అక్బర్ ఆంటోనీ’ పాట వివాదం.. పదం మార్చటానికి సమ్మతి

By Udayavani DhuliFirst Published Nov 12, 2018, 2:03 PM IST
Highlights

సినిమా మాటల్లో,  పాటల్లో  ప్రాసకోసం, సౌండింగ్ కోసం వాడిన పదాలు ఒక్కోసారి వివాదాస్పదమవుతాయి. అప్పుడు ఆ దర్శక,నిర్మాతలు వాటిని తొలిగిస్తూంటారు. ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో  రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’కు అలాంటి సమస్యే ఎదురైంది.

సినిమా మాటల్లో,  పాటల్లో  ప్రాసకోసం, సౌండింగ్ కోసం వాడిన పదాలు ఒక్కోసారి వివాదాస్పదమవుతాయి. అప్పుడు ఆ దర్శక,నిర్మాతలు వాటిని తొలిగిస్తూంటారు. ఇప్పుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో  రవితేజ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం ‘అమర్ అక్బర్ ఆంటోనీ’కు అలాంటి సమస్యే ఎదురైంది.

‘డాన్ బాస్కో’ అంటూ ఫాస్ట్ బీట్‌తో 4 నిమిషాల 42 సెకనుల నిడివితో కూడిన ఓ పాట ను ఈ సినిమాలో చిత్రీకరించారు. అంతేకాకుండా ఇప్పటికే పాటకు చెందిన వీడియోను ఆన్ లైన్ లో రిలీజ్ చేస్తే ..ప్రేక్షక లోకాన్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. ఆ పాటల్లో ఇలియానా లుక్స్ అదిరిపోయాయన్నారు. అంతా బాగానే ఉంది..అయితే ‘డాన్ బాస్కో’ అనే పదంపై అభ్యంతరాలు వచ్చాయి.

‘డాన్ బాస్కో’ సేవా కేంద్ర అశోశియేషన్   మెంబర్స్ ...దర్శక, నిర్మాతలను కలిసి ఆ పదాన్ని పాట నుంచి  తొలిగించమని కోరారు. ‘డాన్ బాస్కో’అనే పదం చాలా పవత్రమైనది అని, 19 శతాబ్దానికి చెందిన ఓ సెయింట్ పేరు అని చెప్పారు. 

‘డాన్ బాస్కో’ పేరు మీద ప్రపంచం మొత్తం మీద అనేక ఎడ్యుకేషనల్ ఇనిస్టిట్యూట్స్ ఉన్నాయని చెప్పారు. దాంతో  ‘డాన్ బాస్కో’పదాన్ని తొలిగించటానికి ఒప్పుకున్నారు. ఈ విషయమై దర్శక,నిర్మాతలు తాము ప్రతీ కమ్యూనిటీ ఫీలింగ్స్ ను గౌరవిస్తామని అన్నారు. ‘డాన్ బాస్కో’ ని తీసేసి..‘డాన్ బ్రాస్కో’గా మారుస్తామని తెలియచేసారు. 

ఇక ఈ  సినిమాతో   ఇలియానా టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్, ట్రైలర్,  పాటలకు ప్రేక్షకులనుంచి మంచి స్పందన రావటమే గాక సినిమాపై అంచనాలు పెంచేసాయి.  రవితేజ మూడు డిఫరెంట్ రోల్స్‌లో కనిపించబోతున్న ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ చిత్రం స‌రికొత్త క‌థ‌, భిన్న‌మైన‌ నేప‌థ్యంలో తెర‌కెక్కింది. 

చిత్రంలో లయ, సునీల్, వెన్నెల కిషోర్, రఘు బాబు, తరుణ్ అరోరా, అభిమన్యు సింగ్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ‌ మైత్రి మూవీ మేక‌ర్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ చిత్రానికి ఎస్ఎస్ థ‌మ‌న్ సంగీతం సమకూరుస్తుండగా.. వెంక‌ట్ సి దిలీప్ సినిమాటోగ్ర‌ఫీ అందిస్తున్నారు. నవంబర్ 16న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. 

click me!