హీరోయిన్ సారా అలీఖాన్ పై నెటిజన్లు ఫైర్!

Published : Feb 28, 2019, 09:55 AM IST
హీరోయిన్ సారా అలీఖాన్ పై నెటిజన్లు ఫైర్!

సారాంశం

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. తాజాగా సారా ఓ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. 

బాలీవుడ్ హీరోయిన్ సారా అలీఖాన్ పై సోషల్ మీడియాలో నెటిజన్లు ఓ రేంజ్ లో ఫైర్ అవుతున్నారు. తాజాగా సారా ఓ మ్యాగజైన్ కోసం ఫోటో షూట్ లో పాల్గొంది. అందులో ఆఫ్రికన్ తెగకు చెందిన ఒక వ్యక్తి పక్కన నిల్చొని పోజిచ్చింది.

ఈ ఫోటో షూట్ లో కెన్యాలో నిర్వహించారు. ఈ ఫోటోలను సదరు మ్యాగజైన్ విడుదల చేసింది. అయితే ఈ ఫోటోలను చూసిన నెటిజన్లు సారాపై మండిపడుతున్నారు  ఒక మనిషిని వస్తువులా వాడుకొని పోజివ్వడం ఏంటి అంటూ సారాని ప్రశ్నిస్తున్నారు.

ఆఫ్రికన్లు మీ ఫోటోషూట్ కోసం వాడుకునే వస్తువులా అంటూ ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు. సాటి మనిషిని అవమానించే విధంగా ఉన్న ఈ ఫోటోలను వెంటనే డిలీట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

ప్రముఖ హీరో సైఫ్ అలీఖాన్ కూతురిగా బాలీవుడ్ లో 'కేథార్ నాథ్' చిత్రం తో ఎంట్రీ ఇచ్చింది సారా. ఇటీవల 'సింబా' చిత్రంతో మంచి హిట్ ను అందుకుంది. 

 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..