Sara Ali Khan Birthday: సారా అలీ ఖాన్ బర్త్ డే... రేర్ ఫోటో షేర్ చేసిన స్టెప్ మదర్ కరీనా కపూర్! 

Published : Aug 13, 2022, 01:52 PM ISTUpdated : Aug 13, 2022, 02:15 PM IST
Sara Ali Khan Birthday: సారా అలీ ఖాన్ బర్త్ డే... రేర్ ఫోటో షేర్ చేసిన స్టెప్ మదర్ కరీనా కపూర్! 

సారాంశం

సారా అలీ ఖాన్ బర్త్ డే సందర్భంగా ఫ్యాన్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్ విషెస్ తెలియజేశారు. సారా స్టెప్ మదర్ కరీనా కపూర్ ఆమెకు స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. ఓ క్యూట్ ఫోటో సోషల్ మీడియాలో పంచుకున్నారు. 


యంగ్ హీరోయిన్ సారా అలీ ఖాన్(Sara Ali Khan) ఆగస్టు 12న బర్త్ డే జరుపుకున్నారు. 27వ ఏట అడుగిడిన సారాకు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఆమె ఫ్యాన్స్, ఫ్రెండ్స్, ఫ్యామిలీ మెంబర్స్, సెలబ్రిటీస్ బర్త్ డే విషెస్ తెలియజేశారు. కాగా సారా స్టెప్ మదర్ కరీనా కపూర్ ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేశారు. సారా చిన్న పాపగా ఉన్నప్పుడు తండ్రి సైఫ్ అలీ ఖాన్ తో ఆడుకుంటున్న ఫోటో కరీనా కపూర్ ఇంస్టాగ్రామ్ స్టేటస్ లో పోస్ట్ చేశారు. హ్యాపీ బర్త్ డే సారా. ఈ రోజు నీకు అన్ లిమిటెడ్ పిజ్జా, కేక్ అంటూ ఎమోజీలు కామెంట్ లో పెట్టారు. 

కూతురిపై కరీనా చూపిన ప్రేమకు నెటిజెన్స్ ఫిదా అవుతున్నారు. సైఫ్ అలీ ఖాన్ మొదటి భార్య అమృతా సింగ్ కి పుట్టిన అమ్మాయే సారా అలీ ఖాన్. సారాకు బ్రదర్ ఇబ్రహీం ఖాన్ కూడా ఉన్నాడు. సైఫ్ కరీనా కపూర్ ని రెండో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు అబ్బాయిలు. ఇక సారా బెస్ట్ ఫ్రెండ్స్ జాన్వీ కపూర్, అనన్య పాండే సైతం ఆమెకు విషెష్ తెలియజేశారు. 

ఇక 2018లో విడుదలైన కేదార్ నాథ్ చిత్రంతో సారా అలీ ఖాన్ హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చారు. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ హీరోగా ఆ మూవీ తెరకెక్కింది. అనంతరం సింబా, లవ్ ఆజ్ కల్, కూలీ నంబర్ వన్ చిత్రాల్లో హీరోయిన్ గా నటించారు. ధనుష్, అక్షయ్ కుమార్ లకు జంటగా సారా చేసిన అత్రాంగి రే సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించగా ఈ మూవీ నేరుగా హాట్ స్టార్ లో విడుదల చేశారు. ప్రస్తుతం సారా  హీరోయిన్ గా రెండు హిందీ చిత్రాలు తెరకెక్కుతున్నాయి.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

భార్యతో పదేళ్ల ప్రేమను సెలబ్రేట్ చేసుకున్న రిషబ్ శెట్టి..బ్యూటిఫుల్ ఫోటోస్ వైరల్
Medha Rana: బోర్డర్ 2తో ప్రేక్షకుల మనసు గెలిచిన నటి ? ఆమె కుటుంబ సభ్యులంతా..