బాహుబలి రైటర్ కథలో హీరోగా కమెడియన్

Published : Sep 11, 2019, 04:59 PM ISTUpdated : Sep 11, 2019, 05:01 PM IST
బాహుబలి రైటర్ కథలో హీరోగా కమెడియన్

సారాంశం

కథ కథనం అందిస్తూ కంచిలో అనే సినిమాకు విజయేంద్ర ప్రసాద్ సమర్పకుడిగా రెడీ అయ్యారు. ఇక ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తుండడం విశేషం. కళ్యాణ్ రామ్ తో గతంలో హరేరామ్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాను తెరకెక్కించిన హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

తెలుగు చిత్ర పరిశ్రమలో ఎన్నో బాక్స్ ఆఫీస్ కథలకు ప్రాణం పోసిన బాహుబలి రైటర్ విజయేంద్ర ప్రసాద్ అప్పుడపుడు చిన్న చిన్న కథలకు కూడా తన మద్దతుతో రూపాన్ని అందిస్తుంటారు. కథ కథనం అందిస్తూ కంచిలో అనే సినిమాకు విజయేంద్ర ప్రసాద్ సమర్పకుడిగా రెడీ అయ్యారు. 

ఇక ఈ సినిమాలో కమెడియన్ సప్తగిరి హీరోగా నటిస్తుండడం విశేషం. కళ్యాణ్ రామ్ తో గతంలో హరేరామ్ వంటి బాక్స్ ఆఫీస్ హిట్ సినిమాను తెరకెక్కించిన హర్షవర్ధన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.రెయిన్‌బో మీడియా ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై శైలేష్‌ వసందాని నిర్మిస్తున్నారు. ఇక కంచిలో సినిమాను పూజా కార్యక్రమాలతో మంగళవారం లాంచ్ చేశారు.

ఈ సినిమాతో ఎలాగైనా సక్సెస్ అందుకోవాలని సప్తగిరి గట్టి నమ్మకమే పెట్టుకున్నాడు. ఈ కమెడియన్ గతంలో నటించిన సినిమాలు కమర్షియల్ గా మంచి వసూళ్లను అందించాయి. అందుకే వరుసగా అవకాశాలను అందుకుంటున్న సప్తగిరి సినిమా కథ నచ్చడంతో సింగిల్ సిట్టింగ్ లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడట. ఇక సినిమా రెగ్యులర్ షూటింగ్ అక్టోబర్ లో మొదలుకానున్నట్లు చిత్ర యూనిట్ వివరణ ఇచ్చింది. 

PREV
click me!

Recommended Stories

Top 6 Romantic Movies: 2025లో టాప్ 6 రొమాంటిక్ మూవీస్, ఆ ఒక్క సినిమాకి ఏకంగా 300 కోట్ల కలెక్షన్స్
2025లో నిర్మాతలను భయపెట్టిన టాప్ 4 డిజాస్టర్ సినిమాలు