
సప్తగిరి ఎక్స్ ప్రెస్ సినిమా ఆడియో వేడుకకు ముఖ్య అతిధిగా పవన్ కళ్యాణ్ హాజరుకాగా నిర్మాత సింధూర పువ్వు కృష్ణారెడ్డి, శరత్ మారర్, హీరోలు సునీల్, నాగ అన్వేష్, డైరెక్టర్ మారుతి, నటీనటలు ఆలీ, శివప్రసాద్, హేమ తదితరలు ఈ ఫంక్షన్ కు అతిధులుగా విచ్చేశారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈ ఫంక్షన్ కు ముఖ్య అతిధిగా హాజరై, సప్తగిరి ఎక్స్ ప్రెస్ ఆడియో సీడిని విడుదల చేశారు. అలానే తొలి కాపీ పై తన సంతకం చేసి హీరో సప్తగిరికి అందజేశారు. దీంతో అభిమానులు కోసం లహరి మ్యూజిక్ వారు పవన్ సంతకంతో ఉన్న ఆడియో సిడీలను విడుదల చేస్తున్నారు.
ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. తాను సినిమాలు పెద్దగా చూడనని, కానీ సప్తగిరి ఎక్స్ ప్రెస్ టీజర్, ట్రైలర్స్ చూశాక తనకు ఈ చిత్రాన్ని చూడాలనిపిస్తోందని, ప్రొడ్యూసర్ రవికిరణ్ గారిని అడిగి కచ్ఛితంగా ఈ చిత్రాన్ని తిలకిస్తానని అన్నారు. సప్తగిరి గారు చేసే కామెడీ తనకు బాగా నచ్చుతుందని, ఇప్పుడు హీరోగా కూడా సప్తగిరి ప్రేక్షకుల్ని అలరిస్తారని మనస్పూర్తిగా ఆశిస్తున్నట్లు పవన్ తెలిపారు. ఇక విజయ్ బుల్గానిన్ అందించిన సంగీతం తనను ఎంతగానో ఆకట్టుకుందని, త్రివిక్రమ్ శిష్యుడిగా అరుణ్ తనకు ఎప్పటినుంచో తెలుసునని, ఇప్పుడు ఈ సినిమాతో అరుణ్ దర్శకుడిగా విజయం సాధించాలని, అలానే సప్తగిరి ఎక్స్ ప్రెస్ కూడా పెద్ద ఎత్తున సక్సెస్ అందుకోవాలని కోరుకుంటున్నట్లుగా పవన్ తెలిపారు.ఇక త్వరలో విడుదల కాబోతున్న ఈ సినిమాకు కో ప్రొడ్యూసర్ : డాక్టర్ వాణి రవికరిణ్, సినిమాటోగ్రాఫర్ : సి.రామ్ ప్రసాద్, ఎడిటిర్ : గౌతంరాజు, ఫైట్స్ : స్టంట్స్ జాషువా, క్రియేటివ్ హెడ్ : గోపాల్ అమిరశెట్టి, మాటలు : రాజశేఖర్ రెడ్డి పులిచర్ల