భార్యతో విడిపోయిన బుల్లితెర కృష్ణుడు, షాకింగ్ విషయం చెప్పిన నితీష్ భరద్వాజ్

Published : Jan 18, 2022, 11:15 PM ISTUpdated : Jan 19, 2022, 06:24 AM IST
భార్యతో విడిపోయిన బుల్లితెర కృష్ణుడు, షాకింగ్ విషయం చెప్పిన నితీష్ భరద్వాజ్

సారాంశం

సీనియర్ నటుడు నితీష్‌ భరద్వాజ్‌ భార్యతో విడిపోతున్నట్లు తెలియజేశారు. నితీష్ భరద్వాజ్‌  'మహాభారతం' సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ సిరీస్లో ఆయన  శ్రీకృష్ణుడి పాత్ర చేశారు.

గ్లామర్ ఇండస్ట్రీలో విడాకులు సర్వసాధారణం. దశాబ్దాల పాటు కలిసి కాపురం చేసిన వారు కూడా చాలా సులభంగా విడాకులు తీసుకుంటారు. బాలీవుడ్ లో అమీర్ ఖాన్ (Amir Khan)కి మిస్టర్ పర్ఫెక్ట్ గా పేరుంది. అలాంటి అమీర్ 15 ఏళ్ల వైవాహిక బంధానికి గత ఏడాది స్వస్తి పలికారు. కిరణ్ రావ్ తో విడిపోతున్నట్లు అధికారికంగా ప్రకటించారు. 

ఇక టాలీవుడ్ లో చోటు చేసుకున్న సమంత-నాగ చైతన్య (Naga Chaitanya) విడాకులు అభిమానులను ఆవేదనకు గురిచేశాయి. లవ్లీ కపుల్ గా పేరుగాంచిన ఈ జంట విడిపోతారని ఎవరూ ఊహించలేదు. 2021 అక్టోబర్ 2న సమంత-చైతూ పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకుంటున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. 

జనవరి 17 అర్ధరాత్రి ధనుష్ (Dhanush)షాకింగ్ న్యూస్ షేర్ చేశారు. భార్య ఐశ్వర్యకు విడాకులు ఇస్తున్నట్లు ప్రకటించి అందరినీ షాక్ కి గురిచేశాడు. 18 ఏళ్ల వివాహబంధం ముగిస్తున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. తాజాగా సీనియర్ నటుడు నితీష్‌ భరద్వాజ్‌ భార్యతో విడిపోతున్నట్లు తెలియజేశారు. నితీష్ భరద్వాజ్‌  'మహాభారతం' సీరియల్ ద్వారా దేశవ్యాప్తంగా పాపులారిటీ తెచ్చుకున్నారు. ఆ సిరీస్లో ఆయన  శ్రీకృష్ణుడి పాత్ర చేశారు. నితీష్ భరద్వాజ్‌ తన భార్య స్మితా తో ఉన్న 12 సంవత్సరాల వైవాహిక జీవితానికి స్వస్తి పలికి విడిపోయినట్లు తెలిపాడు. స్మితా గేట్ ఐఏఎస్ అధికారిణి అని సమాచారం. 

నిజానికి నితీష్‌ భరద్వాజ్‌ (Nitish Bharadwaj)- స్మితా 2019 సెప్టెంబర్‌లోనే విడిపోయారు. వారికి ఇద్దరు కవల కుమార్తెలు. భరద్వాజ్ తన డివోర్స్‌ గురించి 'నేను 2019 సెప్టెంబర్‌లో ముంబైలోని ఫ్యామిలీ కోర్టులో విడాకుల కోసం దాఖలు చేశాను. మేము విడిపోడానికి కారణాలు నాకు చెప్పాలని లేదు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో నడుస్తోంది. నేను చెప్పేది ఏంటంటే.. కొన్నిసార్లు మరణం కంటే విడాకులే చాలా బాధగా ఉంటాయి.' అని ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు.

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చిరంజీవి, అనిల్ రావిపూడి రెమ్యునరేషన్స్ కే బడ్జెట్ మొత్తం అయిపోయిందా ? ఇక సినిమా పరిస్థితి ఏంటి ?
Illu Illalu Pillalu Today Episode Dec 17: వల్లిని గట్టిగా నిలదీసిన రామరాజు, దొంగ సర్టిఫికెట్లతో భాగ్యం