కమిడియన్ సప్తగిరి పవన్ గురించి ఏమన్నాడో తెలుసా

Published : Dec 17, 2017, 12:24 PM ISTUpdated : Mar 25, 2018, 11:54 PM IST
కమిడియన్ సప్తగిరి  పవన్ గురించి ఏమన్నాడో తెలుసా

సారాంశం

రాజకీయాల్లోకి వచ్చేందుకు రెడీ అంటున్న సప్తగిరి

రాజకీయాల్లో సినిమా గాలి బాగా వీస్తాంది. చాన్స్ దొరికితేచాలా మంది రాజకీయాల్లోకి దూకాలనుకుంటున్నారు. కర్నాటకలో, తమిళనాడు, తెలుగునాట ఈ ట్రెండ్ బాగా ఎక్కువగా ఉంది. మళయాళంలో ఇంకా పుంజుకోలేదు. తెలుగు నాట ఇపుడు మరొక హీరో, కమేడియన్ రాజకీయాల్లోకి వచ్చేందుకు ఆసక్తి చూపుతున్నాడు. ఆయనెవరో కాదు. సప్తగిరి. జనసేనాని పిలిస్తే తాను  పవన్ తో కలసి రాజకీయాల్లో పనిచేసేందుకు సిద్ధమని ఆయన చెప్పాడు. జనసేనపార్టీకి తనలాంటి వ్యక్తుల అవసరం ఉందని పవన్ కల్యాణ్ భావించి, ఆహ్వానిస్తే  వెళ్తాను అని ఆయన చెప్పారు. ఆయన తన తాజా చిత్రం 'సప్తగిరి ఎల్ఎల్ బీ' విజయవంతమైన  సందర్భంగా  సొంత జిల్లా అయిన చిత్తూరు జిల్లాలో పర్యటించారు. ఆక్కడక్కడ  మీడియాతో మాట్లాడారు.  అపుడు  రాజకీయాల్లోకి రావడం గురించి విలేకర్లు అడిగిన ప్రశ్నలకి సప్తగిరి సమాధానం ఇచ్చారు. పవన్ కల్యాణ్ గురించి మీ అభిప్రాయం చెప్పండి  అని విలేకరి అడిగినపుడు ఇలా చెప్పారు.  ‘‘పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఎప్పుడూ నా గుండెల్లో ఉంటారు. చిత్తూరు జిల్లా నుంచి ఇండస్ట్రీలోకి  వెళ్ళిన చిన్న వ్యక్తిని నేను. ఇపుడు హీరో అవుతున్నాడంటే ఆయన సంతోషించారు.  సప్తగిరి ఎక్స్‌ప్రెస్‌ సినిమా ఆడియో ఫంక్షన్‌కు రావడం ఎంతో గోప్ప  విషయం. అక్కడ ఆయన అన్న మాటలు ఏవిటో తెలుసా,  ‘తమ్ముడు నీకు నేనున్నాను’ అని. ఇది నాలాంటి వాడికి ఎంత ధైర్యం ఇస్తుంది,’’ అని సప్తగిరి చెప్పారు.

 పవన్‌ కల్యాణ్ పార్టీలో చేరతారా అని అడిగినపుడు ‘‘రాజకీయాలలో నాకు అంత అనుభవం లేదు. నేను చాలా చిన్నవాడిని. అయితే పవర్ స్టార్ పవన్‌ కల్యాణ్ వెంట ఉండటానికి వెనకాడను. రెడీ.పవన్‌ సార్‌ పిలవాలే గానీ, నూటికి నూరు  శాతం వెళ్తాను.’’ అని సప్తగిరి అన్నారు

PREV
click me!

Recommended Stories

అఖండ-2లో బాలయ్య కూతురిగా ఫస్ట్ ఛాయస్ స్టార్ హీరో కూతురట.. ఆమె ఎవరో తెలుసా.?
Jinn Movie Review: జిన్‌ మూవీ రివ్యూ.. హర్రర్‌ సినిమాల్లో ఇది వేరే లెవల్‌