
ఆర్ఆర్ఆర్.. భారత చలనచిత్ర చరిత్రలోనే ఈ చిత్రం ప్రత్యేకంగా నిలిచిపోతుంది. వంద ఏళ్ల పైగా ఉన్న ఇండియన్ సినిమా హిస్టరీలో తొలిసారి ఆర్ఆర్ఆర్ చిత్రం బెస్ట్ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అకాడమీ అవార్డ్స్ కి తొలిసారి నామినేట్ కావడం.. ఆస్కార్ గెలవడం అరుదైన ఘట్టం. దర్శకధీరుడు రాజమౌళి విజన్, పట్టుదలతో ఇది సాధ్యం అయింది.
కీరవాణి సంగీతం.. రాంచరణ్, ఎన్టీఆర్ డ్యాన్స్, ప్రేమ్ రక్షిత్ మాస్టర్, చంద్రబోస్ లిరిక్స్ ఇలా అన్ని అంశాలు రాజమౌళి విజన్ కి తోడయ్యాయి. ఫలితంగా నాటు నాటు సాంగ్ అకాడమీ అవార్డ్స్ వేదికగా జయకేతనం ఎగురవేసింది. ఆర్ఆర్ఆర్ చిత్రం అంతర్జాతీయంగా ఇంతటి విజయాలు సాధిస్తుంటే నిర్మాత దానయ్య ఊసు ఎక్కడా లేదు. దీనితో అనేక పుకార్లు వినిపించాయి. తాజాగా దానయ్య ఆ రూమర్స్ పై క్లారిటీ ఇచ్చారు.
తనని ఎవరూ దూరం పెట్టలేదు అని.. రాజమౌళి గారు తన ఇంట్రెస్ట్ తో గట్టి ప్రయత్నం చేసి విజయం సాధించారు. నాకు పబ్లిసిటీపై ఆసక్తి లేదు కాబట్టి ఆస్కార్స్ లో ఇన్వాల్వ్ కాలేదని దానయ్య అన్నారు. ఇక ఆర్ఆర్ఆర్ చిత్రంపై వచ్చిన మరో హాట్ రూమర్ పై కూడా దానయ్య లేటెస్ట్ ఇంటర్వ్యూలో బదులిచ్చారు.
ఆర్ఆర్ఆర్ చిత్రానికి నిర్మాత దానయ్య అయినప్పటికీ.. ఇన్వెస్ట్ చేసింది మొత్తం మెగాస్టార్ చిరంజీవే అని కొన్ని మీడియా సంస్థలలో పుకార్లు వచ్చాయి. దీనిపై దానయ్య ఒక రేంజ్ లో ఫైర్ అయ్యారు. అలా మాట్లాడే వ్యక్తులకు అసలు మైండ్ ఉందా అని మండిపడ్డారు. ఆర్ఆర్ఆర్ నిర్మాణంలో ఎక్కువ భాగం చిరంజీవిదే అనే వారికి డివివి దానయ్య అదిరిపోయే ఆన్సర్ ఇచ్చారు.
అలాంటి గాలి వార్తలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అసలు చిరంజీవి గారికి ఆ అవసరం ఏముంది. నా సినిమాకి నా ఫైనాన్షియర్లు డబ్బు పెడతారు. చిరంజీవి గారు కావాలంటే ఆయన సొంత చిత్రాలకి డబ్బు పెట్టుకుంటారు కదా.. ఆయనకే నిర్మాణ సంస్థ ఉంది కదా.. అలాంటప్పుడు ఆర్ఆర్ఆర్ చిత్రంలో ఆయన ప్రమేయం ఎందుకు ఉంటుంది. కామన్ సెన్స్ లేనివాళ్లు ఇలాంటి పుకార్లు సృష్టిస్తారు.
ఈ పుకార్లు సృష్టించిన ఆయన నా ఆఫీస్ కి వచ్చారా .. నా బ్యాంక్ స్టేట్మెంట్స్ చూశారా అని ప్రశ్నించారు. అదంతా పూర్తిగా అవాస్తవం. తాను ఈ రూమర్స్ ని తీవ్రంగా ఖండిస్తున్నాను అని దానయ్య అన్నారు.