భగ భగ మండే సూర్యుడు.. KGF 2లో సంజయ్

By Prashanth MFirst Published Feb 7, 2019, 4:52 PM IST
Highlights

KGF ఛాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ప్రకంపనలే సృష్టించింది. చూస్తుంటే మరికొన్ని రోజుల్లో నేషనల్ వైడ్ గా ఇండియన్ సినిమాల్లో సౌత్ సినిమాల హవా గట్టిగా నడిచేలా ఉందని అర్ధమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు సౌత్ సినిమాల్లో కూడా బాలీవుడ్ దిగ్గజ నటీనటులు నటించడానికి రెడీ అవుతున్నారు.

KGF ఛాప్టర్ 1 బాక్స్ ఆఫీస్ వద్ద పెద్ద ప్రకంపనలే సృష్టించింది. చూస్తుంటే మరికొన్ని రోజుల్లో నేషనల్ వైడ్ గా ఇండియన్ సినిమాల్లో సౌత్ సినిమాల హవా గట్టిగా నడిచేలా ఉందని అర్ధమవుతోంది. ఎందుకంటే ఇప్పుడు సౌత్ సినిమాల్లో కూడా బాలీవుడ్ దిగ్గజ నటీనటులు నటించడానికి రెడీ అవుతున్నారు. KGF చూసి ఫిదా అయిన సంజయ్ ఆ సినిమాలో అవకాశం రాగానే సింగిల్ సిట్టింగ్ లోనే గెస్ట్ రోల్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. 

డాన్ లను మించిన డాన్ అవ్వాలని కథానాయకుడు కనిపించే విధానం KGFలో మాస్ ఆడియెన్స్ ని తెగ ఎట్రాక్ట్ చేసింది. అలాంటి సినిమాలో భగ భగ మండే సూర్యుడి ఉగ్రరూపం తరహాలో ఉండే పాత్ర కోసం సంజయ్ ను రెడీ చేస్తున్నారు. సినిమాలో హీరోని దర్శకుడు విలన్స్ తోనే స్ట్రాంగ్ గా ఎలివేట్ చేశాడు. ఇక ఇప్పుడు సంజయ్ పాత్రతో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ఓ కొత్త ప్రయోగమే చేయబోతున్నట్లు అర్ధమవుతోంది. 

త్వరలోనే KGF సెకండ్ చాఫ్టర్ షూటింగ్ ను మొదలెట్టి వీలైనంత త్వరగా పనులన్నిటిని ముగించుకోవాలని చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తోంది. 2020లో సినిమాను విడుదల చేయాలనీ అనుకుంటున్నారు. 150 కోట్లకు పైగా సెకండ్ పార్ట్ కోసం ఖర్చు చేయనున్నట్లు తెలుస్తోంది. 

click me!