బాలీవుడ్ 'ప్రస్థానం' రిజల్ట్.. షాకింగ్ కలెక్షన్స్!

Published : Sep 24, 2019, 04:11 PM IST
బాలీవుడ్ 'ప్రస్థానం' రిజల్ట్.. షాకింగ్ కలెక్షన్స్!

సారాంశం

ఈమధ్య టాలీవుడ్ సినిమాలు బాలీవుడ్‌లో ఎక్కువగా రీమేక్ అవుతున్నాయి. తెలుగులో హిట్ అయిన సినిమాలకు అక్కడ ఆదరణ బావుంటుంది. అందుకే రీసెంట్‌గానే కాకుండా గతంలో ఎప్పుడో రిలీజ్ అయిన సినిమాలు కూడా అక్కడ రీమేక్ చేస్తున్నారు.   

ఈ మధ్యకాలంలో టాలీవుడ్ లో సక్సెస్ అందుకున్న చాలా సినిమాలు బాలీవుడ్ లో రీమేక్ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఆ చిత్రాలను ఆదరిస్తుండడంతో వీటికి డిమాండ్ బాగా పెరిగింది. 

ఈ క్రమంలో తెలుగులో 2010లో సాయికుమార్, శర్వానంద్ ప్రధాన పాత్రల్లోతెరకెక్కిన 'ప్రస్థానం' సినిమాను బాలీవుడ్ లో రీమేక్ చేశారు. సంజయ్ దత్ ఈ సినిమాలో నటించడంతో పాటు నిర్మాతగా కూడా వ్యవహరించారు. తెలుగులో ఈ సినిమా మౌత్ టాక్ తో భారీ వసూళ్లు సాధించింది. కానీ హిందీలో మాత్రం సినిమా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయింది. 

సంజయ్ దత్ లాంటి పెద్ద హీరో నటంచినా కూడా ఆ సినిమాకి వచ్చిన వసూళ్లు చూస్తుంటే షాక్ అవ్వక మానరు. శుక్రవారం అక్కడ రిలీజ్ అయిన ప్రస్థానం మూడు రోజులకు గాను కేవలం మూడు కోట్లు మాత్రమేరాబట్టింది. పెద్ద హీరో సినిమా కనీసం రెండు డిజిటల్ మార్క్ కూడా దాటకపోవడమంటే సినిమా పరిస్థితి ఏంటో అర్ధమవుతోంది.

ఈ సినిమాతో బాలీవుడ్ లో తన మార్క్ క్రియేట్ చేస్తాడని భావించిన దేవకట్టా సత్తా చాటలేకపోయాడు. ప్రస్తుతం ఈ డైరెక్టర్ చేతిలో నెట్ఫ్లిక్స్ వాళ్లు నిర్మిస్తున్న బాహుబలి సినిమా ప్రీక్వెల్ వెబ్ సిరీస్ మాత్రమే ఉంది. కనీసం ఆ సిరీస్ తోనైనా దేవకట్టాకి క్రేజ్ వస్తుందేమో చూడాలి!

PREV
click me!

Recommended Stories

Krishnam Raju: చిరంజీవి ఇలా మనసు పడ్డాడో లేదో, మెడలో ఖరీదైన గిఫ్ట్ పెట్టిన కృష్ణంరాజు.. మర్చిపోలేని బర్త్ డే
మడత మంచం పై పడుకొని, ప్రకృతిని ఆస్వాదిస్తున్న అనసూయ