సంజయ్‌ దత్‌ పారితోషికం లీక్‌.. `డబుల్‌ ఇస్మార్ట్`కి అందేది ఎంతంటే?

Published : Nov 05, 2023, 08:33 PM IST
సంజయ్‌ దత్‌ పారితోషికం లీక్‌.. `డబుల్‌ ఇస్మార్ట్`కి అందేది ఎంతంటే?

సారాంశం

రామ్‌ పోతినేని, పూరీ జగన్నాథ్‌ కాంబినేషన్‌లో `డబుల్‌ ఇస్మార్ట్` చిత్రం రూపొందుతున్న విషయం తెలిసిందే. ఇందులో సంజయ్‌ దత్‌ నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. ఆయన పారితోషికం లీక్‌ అయ్యింది.

బాలీవుడ్‌ మున్నాభాయ్‌ సంజయ్‌ దత్‌(Sanjay Dutt).. నెగటివ్‌ రోల్స్ చేస్తూ సౌత్‌ని రూల్‌ చేస్తున్నాడు. `కేజీఎఫ్‌2`లో తన విశ్వరూపం చూపించాడు. దీంతో ఆయనకు సౌత్‌లో మంచి ఆఫర్లు వస్తున్నాయి. తాజాగా ఆయన తెలుగులో రామ్‌ (Ram Pothineni) సినిమాలో నటిస్తున్నారు. పూరీ జగన్నాథ్‌ రూపొందిస్తున్న `డబుల్‌ ఇస్మార్ట్` (Double Ismart) మూవీలో ఆయన ముఖ్య పాత్ర పోషిస్తున్నారు. బిగ్‌ బుల్‌ అయే నెగటివ్‌ రోల్‌ చేస్తున్నారు. ఈ మూవీకి ఆయన అందుకుంటున్న పారితోషికం లీక్‌ అయ్యింది. సోషల్‌ మీడియాలో అది చక్కర్లు కొడుతుంది. 

ఈ లెక్క ప్రకారం సంజయ్‌ దత్‌.. `డబుల్ ఇస్మార్ట్` చిత్రానికిగానూ ఏకంగా ఆరు కోట్లు పారితోషికం అందుకుంటున్నాడట. సినిమాలో ఆయన పాత్ర బలంగా ఉంటుందని, చాలా కీలకంగా ఉంటున్న నేపథ్యంలో పారితోషికం బాగానే అందిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే ఆయన రేంజ్‌కి అది తక్కువే అయినా, ఒక విలన్‌ పాత్రకి ఆ రేంజ్‌ పారితోషికం ఇవ్వడం ఎక్కువే అని చెప్పొచ్చు. 

`ఇస్మార్ట్ శంకర్‌` చిత్రానికి సీక్వెల్‌గా ఈ మూవీని రూపొందిస్తున్నారు దర్శకుడు పూరీ జగన్నాథ్‌. తన సొంత ప్రొడక్షన్‌లోనే ఈ చిత్రం రూపొందుతుంది. శరవేగంగా ఈ మూవీ చిత్రీకరణ జరుగుతుంది. పూరీ చివరగా `లైగర్‌` మూవీని తెరకెక్కిస్తున్నారు. విజయ్‌ దేవరకొండ హీరోగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద దారుణంగా బోల్తా కొట్టింది. దీంతో `డబుల్‌ ఇస్మార్ట్`ని ప్రతిష్టాత్మకంగా తీసుకుని తెరకెక్కిస్తున్నారు. `ఇస్మార్ట్ శంకర్‌` చిత్రానికి మించి ఉండేలా, డబుల్‌ డోస్‌తో తెరకెక్కిస్తున్నట్టు తెలుస్తుంది. ఈ మూవీని వచ్చే ఏడాది మార్చి 8న పాన్‌ ఇండియా రేంజ్‌లో తెలుగుతోపాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీలో రిలీజ్‌ చేయబోతున్నారు. ఇందులో రామ్‌ సరికొత్త మేకోవర్‌తో కనిపిస్తారని సమాచారం. 

ఇక సంజయ్‌ దత్‌.. `కేజీఎఫ్‌`లో అధీరగా నటించి మెప్పించారు. విలన్‌గా అదరగొట్టారు. దీంతో ఆయనకు సౌత్‌లో నెగటివ్‌ రోల్స్ వస్తున్నాయి. ఇటీవల విజయ్‌ `లియో`లోనూ నటించారు. ఆంటోనీ దాస్‌ పాత్రలో క్రూరమైన విలన్‌గా వాహ్‌ అనిపించారు. ఇప్పుడు `డబుల్‌ ఇస్మార్ట్`తో మరో స్ట్రాంగ్‌ రోల్‌లో కనిపిస్తున్నారు. ఆయన పాత్రకి చాలా ప్రాధాన్యత ఉంటుందని సమాచారం. మరోవైపు హిందీలోనూ కీలక పాత్రలతో మెప్పిస్తున్నారు సంజయ్‌ దత్‌.
 

PREV
AR
About the Author

Aithagoni Raju

అయితగోని రాజు 2020 నుంచి ఏషియానెట్‌ తెలుగులో వర్క్ చేస్తున్నారు. ఆయనకు టీవీ, ప్రింట్‌, డిజిటల్‌ జర్నలిజంలో 13ఏళ్ల అనుభవం ఉంది. ప్రధానంగా న్యూస్‌, సినిమా జర్నలిజం, ఎంటర్‌టైన్‌మెంట్‌ రంగంలో ప్రముఖ సంస్థల్లో వర్క్ చేశారు. ప్రపంచ సినిమాని `షో`(నవతెలంగాణ) పేరుతో రాసిన ప్రత్యేక కథనాలు విశేష గుర్తింపుని తెచ్చిపెట్టాయి. ప్రస్తుతం ఏషియానెట్‌ తెలుగులో ఎంటర్‌టైన్‌ మెంట్ టీమ్‌ని లీడ్‌ చేస్తున్నారు. సబ్‌ ఎడిటర్‌గానే రిపోర్టర్ గా సినిమా ఫీల్డ్ అనుభవం ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్‌ విభాగంలో సినిమా, టీవీ, ఓటీటీ కి సంబంధించి ఆసక్తికర కథనాలను, సినీ ఇండస్ట్రీలోని విషయాలను, సినిమా రివ్యూలు, విశ్లేషణాత్మక కథనాలు రాయడంలో మంచి పట్టు ఉంది. క్వాలిటీ కంటెంట్‌ని అందిస్తూ, క్వాలిటీ జర్నలిజాన్ని ముందుకు తీసుకెళ్లడంలో తనవంతు కృషి చేస్తున్నారు.Read More...
click me!

Recommended Stories

Bigg Boss Telugu 9: ఎలాగైనా రీతూని సైడ్ చేయాలని కళ్యాణ్, ఇమ్మాన్యుయేల్ కుట్ర.. వీళ్ళ స్ట్రాటజీతో భరణి బలి
Akhanda 2 Premiers: అఖండ 2 ప్రీమియర్ షోలు రద్దు, తీవ్ర ఇబ్బందుల్లో నిర్మాతలు.. సినిమా రిలీజ్ పరిస్థితి ఏంటి ?