
దండుపాళ్యం-2 సినిమాలో సంజన నగ్నంగా నటించడం ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలో చర్చనీయాంశంగా మారింది. కొంత మంది ఆమె తీసిన చిత్రం వాస్తవమేనా? కాదా? అన్న చర్చ జరుగుతుంది. ఇప్పుడు కన్నడ సినీ పరిశ్రమలో ఎవరినోట విన్నా సంజన నంటించిన నగ్న చిత్రాలు వివాదాస్పదంగా మారాయి. ఆమె నగ్నంగా నటించిన దుండు పాళ్యం-2 సంబంధించిన కొన్ని పోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అవన్నీ సంజనకు సంబంధించినవే.
టాలీవుడ్ లో పూరిజగ్ననాథ్, ప్రభాస్ కాంబినేషల్‌లో వచ్చిన బుజ్జిగాడు సినిమాలో హీరోయిన్ త్రిష చెల్లెలిగా నంటించిన సంజన, ఆ తరువాత పలు తెలుగు సినీమాల్లో చేసినా హీరోయిన్ గా నిలదొక్కుకోలేకపోయింది. తాజాగా దండుపాళ్యం 2లో అదే సంజన ఇలా న్యూడ్ సీన్స్ లో నటించడం అందరినీ ఆశ్యర్య పరుస్తోంది.
అయితే దీని పై నటీ సంజన క్లారిటీ ఇచ్చుకున్నారు. బుధవారం బెంగళూరులో మీడియా తో మాట్లాడుతూ.. సినీమాలో అలాంటి సీన్లు చేయాల్సి ఉంటుందని తనతో దర్శక నిర్మాతలు ముందే చెప్పారంది. అయితే ఆ దృశ్యాలను చిత్రీకరించిన సమయంలో తను నిండుగా దుస్తులు ధరించానని, ఆ తరువాత గ్రాఫిక్స్ ద్వారా వాటిని నగ్నంగా మార్చారని అంది.
మరోవైపు అశ్లీలత ఎక్కువైందనే కారణంగా దండుపాళ్యం 2లోని ఆ దృశ్యాలకు సెన్సార్ బోర్డు కట్ చెప్పడంతో, వాటిని తొలిగించాకే సినిమా విడుదలకు గ్రీన్ సిగ్నల్ లభించింది. కానీ అంతలోనే తొలగించిన సీన్లు సోషల్ మీడియాలో ప్రత్యక్షం కావడంతో సినిమాపై వివాదం రాజుకుంది. ఆ దృశ్యాలు ఎలా లీకయ్యాయో తెలియదని, 'ఒకవేళ సినిమాలో ఆ సీన్స్ వుంటే బావుండేది.. నటిగా నా తెగువకు ఆ సన్నివేశాలు నిదర్శనం.. మానసికంగా చాలా ప్రిపేర్ అయ్యి ఆ సన్నివేశంలో నటిం చాల్సి వచ్చింది..' అంటూ సంజన క్లారిటీ ఇచ్చింది.