పిల్లల్ని కనాలంటే లైసెన్స్ ఉండాలంటున్న నటి

Published : Dec 31, 2016, 12:17 PM ISTUpdated : Mar 25, 2018, 11:57 PM IST
పిల్లల్ని కనాలంటే లైసెన్స్ ఉండాలంటున్న నటి

సారాంశం

దేశంలో పిల్లల్ని డబ్బు సంపాదనకు దుర్వినియోగం చేస్తున్నారంటున్న నటి సంజన పిల్లల్ని కనాలంటే లైసెన్స్ ఉండాలంటున్న సంజన  

పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ ఉండాలని నటి సంజన అంటోంది. తెలుగు, తమిళం, కన్నడ తదితర భాషా చిత్రాల్లో నటిస్తూ బహుభాషా నటిగా గుర్తింపు పొందిన ఈ భామ కోలీవుడ్‌కు కాదల్‌ సెయ్‌వీర్‌ చిత్రం ద్వారా పరిచయమైంది. తమిళంలో పాపులర్‌ అయిన నటి నిక్కీ గార్లానీ సోదరి సంజన అందరిలాగా తన గురించి, తన చిత్రాల గురించి కాకుండా ఒక వినూత్న భావాన్ని వ్యక్తం చేసింది.

సంజన ఏమంటోందంటే...”మోటార్‌ వాహనాలు నడపడానికి లైసెన్స్ ఉంటుంది. వస్తువుల ఉత్పత్తులకు, వాటి విక్రయాలకు లైసెన్స్ కావలసి ఉంటుంది. అదే విధంగా పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ విధానం అవసరం. చాలా మంది తల్లులు పిల్లల్ని కని వారితో బిచ్చమెత్తిస్తున్నారు. కొందరైతే చంటి పిల్లల్ని చంకనేసుకొని అడుక్కుంటున్నారు. మరి కొందరు మహిళలు పిల్లల్ని అద్దెకు తీసుకొచ్చి బిచ్చమెత్తుకుంటున్నారు. ఇంకొందరు సంపాదన కోసమే పిల్లల్ని కంటున్నారు. అలాంటి తల్లులకు లక్ష రూపాయలు ఇచ్చి ఇకపై పిల్లల్ని అడుక్కునే వారిగా తయారు చేయకండి అని చెప్పినా వారిలో మార్పురాదు. మండే ఎండల్లో రోడ్ల పక్కన జీవశ్చవాల్లా పడిఉన్న అలాంటి పిల్లల్ని చూస్తుంటే దుఃఖం పొంగుకొస్తుంది. వారికి తినడానికి అన్నం, కట్టుకోవడానికి సరైన బట్టలు కూడా ఉండవు. ఇలా చాలా మందిని బాల కార్మికుల్లా మారుస్తున్నారు. అలాంటి బాల కార్మికులు తయారవ్వకుండా ఉండాలంటే పిల్లల్ని కనడానికి తల్లులకు లైసెన్స్ విధానం అమలవ్వాలి. స్త్రీలకు పిల్లల్ని కని పెంచే స్తోమత ఉందా అని విచారించి అందుకు లైసెన్స్ ఇవ్వాలని, అలా లైసెన్స్ లేని వారు పిల్లల్ని కంటే తగిన శిక్ష విధించాలి” అని వ్యాఖ్యలు చేసింది.

 

తాను ఇటీవల ప్రధాని నరేంద్రమోదీని కలిసినప్పుడు పిల్లలను కనడానికి తల్లులకు లైసెన్స్ విధానాన్ని ప్రవేశ పెట్టాలని విజ్ఞప్తి చేసినట్టు నటి సంజన పేర్కొంది.

PREV
click me!

Recommended Stories

K J Yesudas: ఇళయరాజా ఎంత బ్రతిమాలినా నో చెప్పిన యేసుదాస్.. మాస్టర్‌ పీస్‌గా నిలిచిన సాంగ్‌ వెనుక క్రేజీ స్టోరీ
Savitri: జెమినీ గణేషన్‌ని సావిత్రి పెళ్లి చేసుకోవడానికి కారణమైన స్టార్‌ హీరోయిన్‌ ఎవరో తెలుసా? అన్నా అని పిలిచి