వెబ్ సిరీస్‌లో సానియా మీర్జా..వివరాలు

By Surya PrakashFirst Published Nov 17, 2020, 2:24 PM IST
Highlights

ఎమ్ టీవీ నిషేధ్ ఎలోన్ టుగెద‌ర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఐదు ఎపిసోడ్స్ లుగా సాగే వెబ్ సిరీస్ ఎంటీవీ న‌వంబ‌ర్ చివ‌రి వారం నుంచి ప్ర‌సారం కానుంది.
 


భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా త్వరలో తన నటనతో ఆకట్టుకునేందుకు రెడీ అవుతోంది. ఇన్నాళ్లూ కేవలం ఆటతోనే దుమ్మురేపిన ఆమె ఇపుడు న‌ట‌న‌తో తన అభిమానులను ఆక‌ట్టుకునేందుకు సిద్ద‌మ‌వుతుంది. ఎమ్ టీవీ నిషేధ్ ఎలోన్ టుగెద‌ర్ వెబ్ సిరీస్‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌నుంది. ఐదు ఎపిసోడ్స్ లుగా సాగే వెబ్ సిరీస్ ఎంటీవీ న‌వంబ‌ర్ చివ‌రి వారం నుంచి ప్ర‌సారం కానుంది.

అలాగే భార‌త్‌లో ట్యుబ‌ర్య్కులోసిస్ పై అవ‌గాహ‌న క‌ల్పించేలా ఈ సిరీస్ కొన‌సాగ‌నుంది. టీబీ నిరంత‌రం పీడిస్తున్న స‌మ‌స్య అని, క‌రోనా లాంటి విప‌త్క‌ర ప‌రిస్థితుల్లో చాలా ప్ర‌భావం చూపించే అవ‌కాశ‌ముంటుంద‌ని సానియామీర్జా అభిప్రాయ‌పడ్డారు. ఎంటీవీ స‌మ‌ర్పిస్తున్న ఈ షోతో చేప‌ట్టే స‌మిష్టి కృషి ద్వారా దేశంలో సానుకూల‌ మార్పు తీసుకునేందుకు దోహ‌ద‌ప‌డుతుంద‌ని సానియామీర్జా ఆకాంక్షించింది.

 ఇక కొద్ది నెలల క్రితం సానియా మీర్జా  అరుదైన ఘనత సాధించింది. ఆసియా/ఓషియానియా జోన్ నుంచి ఫెడ్ కప్ హార్ట్ అవార్డుకు నామినేట్ అయిన తొలి ఇండియన్‌గా రికార్డులకెక్కింది. ఆమెతోపాటు ఇండోనేషియాకు చెందిన టెన్నిస్ ప్లేయర్ ప్రిస్కా మెడెలిన్ నుగ్రోరో కూడా నామినేట్ అయింది. సానియా ఇటీవల నాలుగేళ్ల తర్వాత ఫెడ్ కప్‌లోకి తిరిగి వచ్చింది. 

click me!