బాలీవుడ్ లో తెలుగోళ్ల ఫైట్: అర్జున్ రెడ్డి vs కంగనా కథలు

Published : Apr 20, 2019, 05:25 PM IST
బాలీవుడ్ లో తెలుగోళ్ల ఫైట్: అర్జున్ రెడ్డి vs కంగనా కథలు

సారాంశం

టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ కి వెళ్లడమనేది చాలా రేర్. అక్కడ క్రేజ్ అందుకోవాలంటే బడా స్టార్స్ సపోర్ట్ కొంతైనా ఉండాలి. అయితే ఇప్పుడు అలాంటి సపోర్ట్ తో టాలీవుడ్ దర్శకులిద్దరు వారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. 

టాలీవుడ్ దర్శకులు బాలీవుడ్ కి వెళ్లడమనేది చాలా రేర్. అక్కడ క్రేజ్ అందుకోవాలంటే బడా స్టార్స్ సపోర్ట్ కొంతైనా ఉండాలి. అయితే ఇప్పుడు అలాంటి సపోర్ట్ తో టాలీవుడ్ దర్శకులిద్దరు వారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మరొ షాకింగ్ విషయమేమిటంటే. ఆ ఇద్దరి సినిమాలో కూడా ఒకే రోజు నార్త్ బాక్స్ ఆఫీస్ వద్ద పోటీకి దిగుతున్నాయి. 

అర్జున్ రెడ్డి సినిమాతో సక్సెస్ కొట్టిన సందీప్ వంగ షాహిద్ కపూర్ తో అదే కథను కబీర్ సింగ్ గా రీమేక్ చేసిన సంగతి తెలిసిందే. జూన్ 21న ఈ సినిమా విడుదల కానుంది. అయితే అదేరోజు ప్రకాష్ కోవెలమూడి అనే మరో తెలుగు దర్శకుడి 'మెంటల్ హై క్యా' సినిమా కూడా రిలీజ్ కావడానికి సిద్ధమైంది.కె.రాఘవేంద్ర రావ్ తనయుడు ప్రకాష్ ఇంతకుముందు అనగనగ ఒక ధీరుడు - సైజ్ జీరో సినిమాలను తెరకెక్కించాడు. 

ఇక ఇప్పుడు స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ తో మెంటల్ హై క్యా అనే ఒక డిఫరెంట్ సైకలాజికల్ సినిమాను తెరకెక్కించిన ప్రకాష్ ఫస్ట్ లుక్స్ తోనే మంచి హైప్ క్రియేట్ చేశాడు. మొత్తానికి రెండు సినిమాలకు మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇద్దరు కూడా తెలుగు దర్శకులే కావడంతో ఎవరు బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎక్కువ వసూళ్లను అందుకుంటారో? అనే విషయం హాట్ టాపిక్ మారింది. 

PREV
click me!

Recommended Stories

Kalyan Padala Winner: కమన్‌ మ్యాన్‌దే బిగ్‌ బాస్‌ తెలుగు 9 టైటిల్‌.. బిగ్ బాస్‌ చరిత్రలో రెండోసారి సంచలనం
Demon Pavan: జాక్ పాట్ కొట్టిన డిమాన్ పవన్.. భారీ మొత్తం తీసుకుని విన్నర్ రేసు నుంచి అవుట్