మహేష్ తో డౌటే.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ కొత్త సినిమా విశేషాలు!

Published : Jun 21, 2019, 04:05 PM IST
మహేష్ తో డౌటే.. అర్జున్ రెడ్డి డైరెక్టర్ కొత్త సినిమా విశేషాలు!

సారాంశం

అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ వంగా అందరి దృష్టిని ఆకర్షించారు. బోల్డ్ అండ్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం ఘనవిజయంగా నిలిచింది.

అర్జున్ రెడ్డి చిత్రంతో దర్శకుడు సందీప్ వంగా అందరి దృష్టిని ఆకర్షించారు. బోల్డ్ అండ్ ఎమోషనల్ ప్రేమకథగా తెరకెక్కిన అర్జున్ రెడ్డి చిత్రం ఘనవిజయంగా నిలిచింది. సందీప్ వంగా దర్శకత్వ ప్రతిభకు స్టార్ హీరోలతో సినిమాలు చేసే అవకాశం వచ్చింది. సందీప్ వంగా చేయాల్సిందల్లా మంచి కథతో హీరోలని మెప్పించడమే. 

సందీప్ వంగ హిందీలో షాహిద్ కపూర్ హీరోగా అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్ చిత్రాన్ని తెరకెక్కించారు. కబీర్ సింగ్ చిత్రం నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దీనితో సందీప్ వంగా తదుపరి చిత్రం ఎవరితో అనే ఆసక్తి నెలకొని ఉంది. అర్జున్ రెడ్డి చిత్రం తర్వాత సందీప్ వంగాకు సూపర్ స్టార్ మహేష్ బాబు అవకాశం ఇచ్చాడు. తన కోసం కథ సిద్ధం చేయమని ఆఫర్ ఇచ్చాడు. కానీ సందీప్ కథతో మహేష్ పూర్తి సంతృప్తిగా లేనట్లు తెలుస్తోంది. 

దీనితో సందీప్ మరో కథతో సినిమా చేసేందుకు సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సందీప్ క్రైమ్ నేపథ్యంలో సాగే ఓ కథని సిద్ధం చేస్తున్నాడట. ఈ చిత్రం హీరోగా ఎవరు నటిస్తారనేది త్వరలో తెలియనుంది. 

PREV
click me!

Recommended Stories

Top 10 Heroines : రష్మిక కు సమంత గండం, సినిమాలు లేకున్నా మొదటి స్థానంలో ఎలా? టాప్ 10 హీరోయిన్ల లిస్ట్ ఇదే?
Malliswari Review: బావ మరదలుగా ఎన్టీఆర్, భానుమతి రొమాన్స్, ఫస్ట్ తెలుగు పాన్ వరల్డ్ మూవీగా మల్లీశ్వరి రికార్డు..