మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘యానిమల్’ నుంచి బిగ్ అప్డైట్ అందింది. అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ట్రైలర్ కు డేట్ ఫిక్స్ చేశారు మేకర్స్. తాజాగా సాలిడ్ పోస్టర్ తో అనౌన్స్ మెంట్ చేశారు.
‘అర్జున్ రెడ్డి’తో దర్శకుడు సందీప్ రెడ్డి వంగ (Sandeep Reddy Vanga) ఎంతటి సెన్సేషన్ క్రియేట్ చేశారో తెలిసిందే. ఆ సినిమాలోని హీరో అటిట్యూడ్, రొమాన్స్, ఎమోషనల్ కంటెంట్ తో ఎంత వాయెలెంట్ చూపించారో చూశాం. నెక్ట్స్ బాలీవుడ్ స్టార్ హీరో రన్బీర్ కపూర్ (Ranbir Kapoor) తో హిందీలో ‘యానిమల్’ (AnimalThe Film)ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. నేషనల్ క్రష్ రష్మిక మందన్న(Rashmika Mandanna) కథానాయిక. ప్రస్తుతం ఈ మూవీ రిలీజ్ కు సిద్ధంగా ఉంది.
మరో పది రోజుల్లో ఈ మోస్ట్ అవైటెడ్ యాక్షన్ అండ్ రొమాంటిక్ ఫిల్మ్ ‘యానిమల్’ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇప్పటికే వదిలిన పోస్టర్లు, పాటలు, టీజర్ కు భారీ రెస్పాన్స్ దక్కింది. సందీప్ రెడ్డి మార్క్ డైరెక్షన్ మరోసారి రిపీట్ అవుతుండటం, రన్బీర్ లాంటి బడా హీరో రా అండ్ రగ్డ్ లుక్ లో కనిపించబోతుడటం ఫ్యాన్స్ లో ఆసక్తిని పెంచుతోంది. ఈ క్రమంలో యూనిట్ కూడా ఇంట్రెస్టింగ్ గా సినిమా ప్రచార కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
undefined
ఇప్పటికే వరుసగా సాంగ్స్ విడుదల చేస్తూ ఆకట్టుకుంటున్న టీమ్ తాజాగా బిగ్ అనౌన్స్ మెంట్ చేసింది. Animal Trailer ను విడుదల చేయబోతున్నట్టు ప్రకటించింది. నవంబర్ 23న చిత్ర ట్రైలర్ ను రిలీజ్ చేస్తున్నట్టు అధికారికంగా వెల్లడించారు. మూడు రోజుల్లో ఈ బిగ్ అప్డేట్ రానుంది. దీంతో పాటు విడుదల చేసిన పోస్టర్ ఆసక్తికరంగా మారింది. సందీప్ రెడ్డి వంగ, రన్బీర్ కపూర్ కలిసి ఉన్న పోస్టర్ ఇంట్రెస్టింగ్ గా ఉంది.
మొత్తానికి ట్రైలర్ అప్డేట్ రావడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఇక గతంలో వైలెన్స్ అంటే చూపిస్తానని చెప్పిన సందీప్ రెడ్డి వంగా ఎలాంటి సెన్సేషన్ చేయబోతున్నారనేది ఆసక్తికరంగా మారింది. ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు పెరగనున్నాయి. ఇప్పటికే రిలీజ్ కు ఓ రేంజ్ లో ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ భారీ చిత్రాన్ని టీ-సిరీస్, భద్రకాళి పిక్చర్స్, సినీ1 స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించారు. ఈ చిత్రంలో అనిల్ కపూర్, బాబీ డియోల్, తృప్తి డిమ్రి మొదలైనవారు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి ప్రీతమ్, విశాల్ మిశ్రా, జానీ సంగీతం అందిస్తున్నారు. హర్షవర్దన్ రామేశ్వర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అదిస్తుండటం విశేషం. వంద కోట్ల బడ్జెట్ తో నిర్మించిన ఈ చిత్రం 2023 డిసెంబర్ 1న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది.
Guys animal trailer is coming out on 23rd November..
The party is just getting started. ✨💃🏻 … pic.twitter.com/t584nvkPPG