'నీకంత సీన్ లేదు.. సినిమాలు మానెయ్' సందీప్ ని అవమానించిన అగ్రనిర్మాత!

Published : Jul 01, 2019, 02:29 PM ISTUpdated : Jul 01, 2019, 02:30 PM IST
'నీకంత సీన్ లేదు.. సినిమాలు మానెయ్' సందీప్ ని అవమానించిన అగ్రనిర్మాత!

సారాంశం

యంగ్ హీరో సందీప్ కిషన్ సరైన హిట్టు పడక కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు.

యంగ్ హీరో సందీప్ కిషన్ సరైన హిట్టు పడక కెరీర్ పరంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. మధ్యలో తమిళంలో కొన్ని సినిమాలు చేశాడు. అవి ఓ మోస్తరుగా ఆడినా.. తెలుగులో మాత్రం ఈ హీరోకి సక్సెస్ రావడం లేదు. రకరకాల జోనర్లు ఎన్ని ప్రయత్నిస్తున్నా.. వర్కవుట్ కావడం లేదు.

దీంతో తనే నిర్మాతగా మారి 'నిను వీడని నీడను నేనే' అనే సినిమాను రూపొందిస్తున్నాడు. తాజాగా సినిమా ట్రైలర్ కూడా విడుదలైంది. ఈ సందర్భంగా ఓ అగ్రనిర్మాత తనను అవమానపరిచాడని సందీప్ కిషన్ ఆవేదన వ్యక్తం చేశాడు.

తాను వరుసగా ఫ్లాప్ లు ఎదుర్కోవడంతో తన పనైపోయిందని.. ఇక సినిమాలు మానుకోవాలని ఆ పెద్ద నిర్మాత అన్నాడని సందీప్ వెల్లడించాడు. ఆ మాటలు తనను 
ఎంతగానో బాధించాయని.. కానీ తానేమీ ఆ నిర్మాతపై కక్ష పెంచుకోలేదని సందీప్ చెప్పాడు.

ఆయన మాటలను పాజిటివ్ గా తీసుకొని తనేంటో నిరూపించుకోవాలనే పట్టుదలతో నిర్మాతగా మారి 'నిను వీడని నీడను నేనే' సినిమా తీసినట్లు సందీప్ చెప్పుకొచ్చాడు. తనను అవమానపరిచిన ఆ అగ్ర నిర్మాత ఎవరనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు.

సందీప్ కోరుకుంటున్నట్లుగా 'నిను వీడని నీడను నేనే' సినిమాతో సక్సెస్ అందుకొని ఆ అగ్ర నిర్మాతకు సమాధానం చెబుతాడేమో చూడాలి.. కార్తిక్ రాజు అనే కొత్త దర్శకుడు డైరెక్ట్ చేసిన ఈ సినిమా జూలై 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

PREV
click me!

Recommended Stories

Sobhita Dhulipala: నాగచైతన్యతో రిలేషన్‌షిప్‌పై ట్రోలింగ్... తొలిసారి నోరు విప్పిన శోభితా ధూళిపాళ
Jananayagan Release: జననాయగన్ రిలీజ్ ఎందుకు ఆలస్యం? నిజం చెప్పడానికి డైెరెక్టర్ ఎందుకు భయపడుతున్నారు?