సైరా కోసం భారీ డీల్స్.. క్లోజ్ చేసిన చరణ్?

Published : Jul 01, 2019, 11:21 AM IST
సైరా కోసం భారీ డీల్స్.. క్లోజ్ చేసిన చరణ్?

సారాంశం

  ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సైరా షూటింగ్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే;. మెగాస్టార్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఉయ్యాలవాడ నరసింహా రెడ్డి జీవిత ఆధారంగా తెరకెక్కుతున్న సైరా షూటింగ్ ఇటీవల ముగిసిన సంగతి తెలిసిందే;. మెగాస్టార్ కథానాయకుడిగా నటించిన ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి. ఇక పోస్ట్ ప్రొడక్షన్ పనులను వీలైనంత త్వరగా పూర్తి చేసి ప్రమోషన్ డోస్ పెంచాలని నిర్మాత రామ్ చరణ్ ఆలోచిస్తున్నాడు. 

అదే విధంగా బిజినెస్ డీల్స్ కూడా క్లోజ్ చేయాలనీ ప్లాన్ చేస్తున్నాడు. అయితే కన్నడ డబ్బింగ్ రైట్స్ కోసం ఒక బడా డిస్ట్రిబ్యూటర్ మంచి ఫిగర్ ని అఫర్ చేసినట్లు తెలుస్తోంది. 30కోట్లతో కన్నడ డబ్బింగ్ రైట్స్ ఇవ్వాలని కొణిదెల ప్రొడక్షన్స్ తో డీల్ కూర్చుకునేందుకు సిద్ధంగా ఉన్నారట. అయితే చరణ్ కూడా ఈ అఫర్ కి ఫిదా అయినట్లు తెలుస్తోంది. 

మెగాస్టార్ కెరీర్ లో అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సైరా తెలుగు - హిందీలో లో డైరెక్ట్ గా రిలీజ్ కానుంది. అయితే తమిళ్ - మలయాళం - కన్నడ భాషలో ఈ సినిమాను డబ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. అయితే ముందుగా కన్నడ బిజినెస్ ను రామ్ చరణ్ 30కోట్లకు క్లోజ్ చేసినట్లు సమాచారం. 

PREV
click me!

Recommended Stories

70 ఏళ్ల వయసులో ప్రభాస్, రణ్ వీర్ సింగ్ కు షాక్ ఇచ్చిన చిరంజీవి, బాక్సాఫీస్ దగ్గర మెగా మూవీ రచ్చ..
ఐటమ్ సాంగ్స్ చేయాలంటే కండీషన్స్ ఒప్పుకోవాల్సిందే, రష్మిక మందన్న షరతులేంటో తెలుసా?