ఆస్పత్రిలో హీరోయిన్ .. డబ్బుల్లేక అభిమానులకు వినతి

By Prashanth MFirst Published Feb 23, 2019, 12:50 PM IST
Highlights

శాండిల్ వుడ్ లో ఒకప్పటి స్టార్ నటి విజయలక్ష్మి ఆరోగ్యం ప్రస్తుతం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. బెంగుళూర్ ఆసుపత్రిలో చిక్కిట్స్ పొందుతున్న ఆమెకు కనీస ఆర్థిక సహాయాన్ని అందించాలని ఆమె సోదరి అభిమానులను వేడుకోవడం అందరిని షాక్ కి గురి చేస్తోంది. కొన్నేళ్ల క్రితం సౌత్ సినిమాలతో బిజీగా ఉన్న ఆమె ఇప్పుడు సీరియల్స్ తో కెరీర్ ను నెట్టుకొస్తున్నారు. 

నాగమండల, సూర్యవంశ, నంబర్‌ ఇన్‌ సినిమాలతో కన్నడలో మంచి గుర్తింపు తెచ్చుకున్న విజయలక్ష్మి తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితమే. జగపతి బాబు - అర్జున్ సార్జా నటించిన హనుమాన్ జంక్షన్ మూవీలో మరో హీరో వేణుకి జోడిగా, కథానాయకులకు చెల్లిగా నటించారు. ఆ సినిమాతో ఎంతో గుర్తింపు తెచ్చుకున్న విజయలక్ష్మి కొన్నేళ్ల అనంతరం సీరియల్స్ ద్వారా బిజీ అయ్యారు. 

ఇక ఇటీవల అధిక రక్తపోటు ఇతర అనారోగ్య సమస్యల కారణంగా ఆసుపత్రిలో చేరారు. అయితే గతంలోనే ఆమె తల్లిగారికి ఆరోగ్యం కోసం ఉన్న డబ్బు మొత్తం ఖర్చు చేయడం వల్ల ఇప్పుడు విజయలక్ష్మి దగ్గర రూపాయి కూడా లేదని అందుకే అభిమానులను ఆర్థికసహాయాన్ని కోరుతున్నట్లు ఆమె సోదరి చెబుతున్నారు.  

click 100కు పైగా చిత్రాల్లో నటించిన టాప్ తెలుగు హీరోలు

click me!