సాహస యోధుడివి అన్నయ్యా అంటూ సముద్రఖని ఎమోషనల్.. పవన్ లెటర్ కి రిప్లై

Published : Apr 27, 2023, 03:53 PM IST
సాహస యోధుడివి అన్నయ్యా అంటూ సముద్రఖని ఎమోషనల్.. పవన్ లెటర్ కి రిప్లై

సారాంశం

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే పవన్ సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తం రీమేక్ ని పూర్తి చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 28న రిలీజ్ కి రెడీ అవుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. ఇటీవలే పవన్ సముద్రఖని దర్శకత్వంలో వినోదయ సిత్తం రీమేక్ ని పూర్తి చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 28న రిలీజ్ కి రెడీ అవుతోంది. మరోవైపు పవన్ హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో ఓజి చిత్రాల్లో నటిస్తున్నారు. 

అయితే వినోదయ సిత్తం రీమేక్ పై పవన్ ఫ్యాన్స్ లో మొదటి నుంచి వ్యతిరేకత ఉంది. ఎందుకంటే ఈ చిత్రం పవన్ ఇమేజ్ కి సరిపడే కథ కాదని పైగా రీమేక్ అని పవన్ ఫ్యాన్స్ నిరాశలో ఉన్నారు. ఏది ఏమైనా రిలీజ్ టైం దగ్గర పడుతుండడంతో త్వరలో ప్రచార కార్యక్రమాలు షురూ కానున్నాయి. ఈ చిత్రంలో పవన్, సాయిధరమ్ తేజ్ తొలిసారి కలసి నటిస్తున్నారు. బుధవారం రోజు సముద్రఖని 50 వ వసంతంలోకి అడుగుపెట్టారు. 

దీనితో అభిమానులు, స్నేహితులు, సినీ ప్రముఖులు సముద్రఖని బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. తన దర్శకుడికి పవన్ కళ్యాణ్ కూడా ప్రత్యేక శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు పవన్ ఓ లెటర్ ని విడుదల చేశారు. ప్రతిభావంతుడైన దర్శకుడు, నటుడు , రచయిత మా బంగారు గని సముద్రఖని గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు అని పవన్ తన లేఖలో అనేక విషయాలు ప్రస్తావిస్తూ ఆయన్ని ప్రశంసించారు. 

ఇదిలా ఉండగా పవన్ కళ్యాణ్ లేఖకు సముద్రఖని ఎమోషనల్ గా స్పందించారు. 'అన్నయ్యా మీరు నా పట్ల చూపించిన ప్రేమాభిమానాలకు కృతజ్ఞుడిని. మీతో నటుడిగా దర్శకుడిగా ఈ ప్రయాణం ఎన్నో మంచి విషయాలని నేర్పించింది. మరింత గొప్పగా కొనసాగేందుకు కావలసిన ధైర్యాన్ని, చైతన్యాన్ని ఇచ్చింది. 

ముఖ్యంగా సమాజం పట్ల మీకున్న అక్కర ప్రేమ నన్ను మీ వ్యక్తిత్వానికి అభిమానిగా మారేలా చేశాయి. సదా మీలాంటి సాహస యోధుడు ఆలోచనలకు సహచరుడినై ఉండాలని కోరుకుంటాను. ప్రజాశ్రేయస్సుకై మీరు కలలుగానే మార్పు సాకారమై, తెలుగురాష్ట్రాలకే కాక యావత్ దేశానికి మేలు జరిగేలా మిమ్మల్ని భగవంతుడు నడిపించాలని కోరుకుంటున్నాను అని సముద్రఖని ఎమోషనల్ రిప్లై ఇస్తూ లేక విడుదల చేశారు. 

PREV
click me!

Recommended Stories

Yogibabu బ్రహ్మానందం కలిసి వస్తే.. నవ్వులు సునామీ వచ్చేది ఎప్పుడంటే?
Manchu Manoj: రామ్‌ చరణ్‌, శింబులను దించుతున్న మంచు మనోజ్‌.. అదిరిపోయేలా `డేవిడ్‌ రెడ్డి` గ్లింప్స్