నాగశౌర్య 'లక్ష్య' రిలీజ్ డేట్ ఫిక్స్

By Surya PrakashFirst Published Nov 25, 2021, 3:28 PM IST
Highlights

ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. పార్ధు అనే క్రీడాకారుడి జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిస్తున్నాం. నాగశౌర్య, పాత్ర రెండు భిన్న పార్శ్వాల్లో సాగుతుంది.  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం అని తెలిపారు.  లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నాగశౌర్య ఉన్నాడు.

కొంతమందికి ఆటతో గుర్తింపు వస్తుంది. కానీ కొందరు మాత్రం ఆటకే గుర్తింపును తీసుకొస్తారు. అర్చరీకి పూర్వ వైభవాన్ని తీసుకొచ్చిన ఓ ఆటగాడి ప్రయాణమే ఈ చిత్ర ఇతివృత్తం అంటున్నారు నాగశౌర్య. ఆయన హీరోగా నటిస్తున్న చిత్రం లక్ష్య. ధీరేంద్ర సంతోష్‍ జాగర్లపూడి దర్శకుడు. నారాయణదాస్‍ కె నారంగ్‍, పుస్కూర్‍ రామ్‍మోహన్‍ రావు, శరత్‍మరార్‍ నిర్మిస్తున్నారు.  షూటింగ్ పూర్తయింది. నాగశౌర్యకి తండ్రి పాత్రలో జగపతిబాబు ఒక కీలకమైన పాత్రను పోషించారు. ఇటీవల వీళ్ల కాంబినేషన్లో వచ్చిన లిరికల్ సాంగ్ ఆకట్టుకుంది.

ఈ సినిమాలో నాగశౌర్య సిక్స్ ప్యాక్ తో .. న్యూ లుక్ తో కనిపించనున్నాడు. పోస్టర్స్ నుంచి ప్రతి అప్ డేట్ సినిమాపై అంచనాలు పెంచేలా ఆయన శ్రద్ధ తీసుకుంటున్నాడు. తాజాగా ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేశారు. డిసెంబర్ 10వ తేదీన ఈ సినిమా రిలీజ్ డేట్ ను ఖరారు చేస్తూ పోస్టర్ ను వదిలారు.

 నిర్మాతలు మాట్లాడుతూ.. ప్రాచీన విలువిద్య నేపథ్యంలో రూపొందుతున్న చిత్రమిది. పార్ధు అనే క్రీడాకారుడి జీవితంలోని ఎత్తుపల్లాలను ఆవిష్కరిస్తూ తెరకెక్కిస్తున్నాం. నాగశౌర్య, పాత్ర రెండు భిన్న పార్శ్వాల్లో సాగుతుంది.  నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుతున్నాం అని తెలిపారు.  లవ్ .. యాక్షన్ .. ఎమోషన్ ప్రధానంగా సాగే ఈ సినిమా తనకి తప్పకుండా హిట్ ఇస్తుందనే నమ్మకంతో నాగశౌర్య ఉన్నాడు. ఆయన నమ్మకాన్ని ఈ సినిమా ఎంతవరకూ నిలబెడుతుందో చూడాలి. ఇటీవల నాగశౌర్య నుంచి వచ్చిన 'వరుడు కావలెను' ఫలితం ఆయనను నిరాశ పరిచిన సంగతి తెలిసిందే.

Also read Drushyam 2 Movie Review : దృశ్యం 1 ను మించి ...

పోస్ట్ ప్రొడక్షన్ సహా అన్ని పనులను లక్ష్య సినిమా పూర్తి చేసుకుంది. ఈ సినిమాపై అంచనాలను మరింత పెంచేందుకు చిత్రబృందం భారీ ప్రమోషన్స్‌ని ప్లాన్ చేస్తోంది. సోనాలి నారంగ్‌ సమర్పించగా, శ్రీ వెంకటేశ్వర సినిమాస్‌ ఎల్‌ఎల్‌పీ శరత్ మరార్‌, నారయణ దాస్‌ కె, నారంగ్‌, పుస్కుర్‌ రామ్ మోహన్ రావు, నార్త్‌స్టార్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ బ్యానర్స్‌ కలిసి నిర‍్మిస్తున‍్నాయి. ఈ సినిమాలో నటుడు జగపతిబాబు కీలక పాత‍్రలో కనిపించనున్నారు. హీరోయిన్‌గా కేతిక శర్మ చేస్తున్నారు. చిత్రానికి సంగీతం కాల భైరవ అందించగా, రామ్‌ రెడ్డి సినిమాటోగ్రఫర్‌గా పనిచేశారు. 
 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Naga Shaurya (@actorshaurya)

click me!