Odela-2 Movie: మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రధాన పాత్రలో నటించిన ఓదెల-2 చిత్రం ఇటీవల విడుదలైంది. ఈ సినిమాకు కథ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ సంపత్ నంది రాశారు. ఓదెల 2 సినిమాలో వశిష్ట సింహా విలన్‌గా నటించాడు. దుష్టశక్తి నుంచి గ్రామాన్ని కాపాడేందుకు పోరాటం చేసే భైరవి పాత్రలో తమన్నా తన యాక్టింగ్‍తో మెప్పించారు. ఇక చిత్రంలో యువ, వంశీ, గగన్ విహారి, సురేందర్ రెడ్డి కీలక పాత్రల్లో నటించారు. సినిమాకి అజ్నిష్ లోకనాథ్ దర్శకత్వం వహించారు. మధు క్రియేషన్స్, సంపత్ నంది టీమ్‍వర్క్స్ బ్యానర్లు ఈ చిత్రాన్ని నిర్మించారు.
ఓదెల సినిమా కథ విషయానికి వస్తే.. ఓదెల అనే గ్రామంలో నర హత్యలు జరుగుతుంటాయి. ఈక్రమంలో తిరుపతి (వశిష్ట)ని రాధా (హెబ్బా పటేల్) చంపేస్తుంది. ఆ తర్వాత కొన్నాళ్లకు ప్రేతాత్మగా మారిన తిరుపతి గ్రామానికి వస్తాడు. కొత్తగా పెళ్లైన నవ వధువులను అతను టార్గెట్ చేస్తాడు. ఇలా ఇద్దరు ముగ్గురిని చంపిన తర్వాత గ్రామస్థులు రాధ దగ్గరికి వెళ్లగా ఆమె.. తన సోదరి, నాగసాధువు అయిన భైరవి (తమన్నా భాటియా) ఈ అతీత శక్తితో పోరాడగలదని చెప్తుంది. తిరుపతి ఆత్మను అంతం చేసే లక్ష్యంతో ఓదెల గ్రామంలో భైరవి అడుగుపెడుతుంది. ఇక తిరుపతి నుంచి ఊరి ప్రజల్ని బైరవి ఏవిధంగా రక్షించింది. ఎలా ఎదుర్కొంది అన్నదే సినిమా కథ.
ఓదెల-2 చిత్రం ఇటీవల విడుదల కాగా.. సినిమాకు సంబంధించి సక్సెస్ మీట్‌ను రీసెంట్‌గా హైదరాబాద్‌లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంపత్ నందికి ఓ వ్యక్తి నుంచి ఇంట్రెస్టింగ్ ప్రశ్న ఎదురైంది. ఓదెల గ్రామంలో పెళ్లేన నవ దంపతులకు మొదటి రాత్రిని పంట పొలాల్లో పెడుతుంటారు.. అది మీ రియల్ ఎక్స్‌పీరియన్స్ నుంచి వచ్చిన ఆలోచన అని అడిగారు.. ఈ ప్రశ్నతో అవాక్కైన సంపతి నంది.. అలాంటిది ఏమీ లేదని సమాధానమిచ్చాడు. తనకు అలాంటి అనుభవాలు ఏమీ లేవని నవ్వుతూ, సిగ్గుపడుతూ సమాధానం ఇచ్చారు.
పండల సమయంలో ముఖ్యంగా సంక్రాంతి కోడి పందేలు పొలాల్లో నిర్వహిస్తారు కాదా.. అలానే ఒక్కోచోట ఒక్కో ఆచారం అన్నట్లు ఆ ఆలోచనలో అక్కడ పెట్టినట్లు సంపత్ చెప్పుకొచ్చాడు. వారికి మొక్కజొన్న పొలాల్లో మంచెలు ఉండేవని, అక్కడే పైకి ఎక్కి కూర్చోని తినడం, పడుకోవడం వంటికి చేసేవారని అలా డిఫరెంట్ థాట్‌తో చేసిన సీన్లు అవి అని సంపత్ నంది తెలిపారు. అయితే.. అసలు ఇలాంటి ప్రశ్న అడుగుతారని కూడా గెస్ చేయని సంపత్ నంది.. కాస్త షాక్‌కి గురయ్యాడు.