Betting App: సోషల్ మీడియాను బాగా ఫాలో అయ్యేవారికి బుల్లితెర సెలబ్రిటీ ఉప్పల్ బాలు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. టిక్‌టాక్ వీడియోల నుంచి ఫేమస్ అయిన బాలు.. తన డ్యాన్స్ మాటలతో అందరినీ ఆకట్టుకుంటూ.. నవ్వులు పూయిస్తుంటాడు. ఇప్పటికే అనేక యూట్యూబ్ ఛానల్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. రీసెంట్‌గా బాలు మాట్లాడుతూ.. తన కుటుంబ నేపథ్యం, వ్యక్తిగత జీవితం గురించి అనేక విషయాలు పంచుకున్నారు. దీంతోపాటు బెట్టింగ్ యాప్‌లను ఎందుకు ప్రమోట్ చేయలేదో చెప్పుకొచ్చారు... తను ఆ ఇంటర్వ్యూలో చెప్పింది విన్న తర్వాత ఉప్పల్ బాలు మీద అందరికీ రెస్పెక్ట్ పెరిగిపోయింది.
ఉప్పల్ బాలు.. అనేక కామెడీ షోలలో నటించాడు. సినిమా అవకాశాలు పెద్దగా రాకపోయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం హల్‌చల్ చేస్తూ ఫాన్ ఫాలోయింగ్ పెంచేసుకున్నాడు. తన ఏది మాట్లాడినా, డ్యాన్స్ చేసినా వైరల్ అవుతుంది. ఇక ఉప్పల్ బాలుతో బుల్లితెరపై అనేక కామెడీ షోలకు పిలిచి ఒక్కో షోకి రూ.5 నుంచి 10 వేల వరకు ఇచ్చేవారంట. దీంతోపాటు బయట ఈవెంట్లకు వెళ్లి అక్కడ డ్యాన్స్, మాటలతో అందరినీ అలరిస్తుంటాడు మన బాలు.
జెండర్ పలానా అని ఇప్పటికైతే ఎవరికీ చెప్పలేదు...
ఉప్పల్ బాలు అబ్బాయి అయినప్పటికీ.. చీరలు కట్టుకోవడం, డ్రెస్‌లు వేసుకోవడం, పొడవుగా జుట్టు పెంచుకోవడం, తన నడక, మాట తీరు అంతా అమ్మాయిలాగే ఉంటుంది. అయితే.. బాలు ఎంత తెలివైనోడు .. తన జెండర్ పలానా అని ఇప్పటికైతే ఎవరికీ చెప్పలేదు. తన జెండర్ ఏదైనా.. అతని పరిధిలో అతను ఉంటూ.. అందరినీ నవ్విస్తూ, తన కంటూ కొన్ని విలువలు ఉన్నాయని చాటి చెబుతుంటాడు.
చిన్ననాటి నుంచి పేదరికం..
ఇప్పటికే అనేక షోలు, సోషల్ మీడియాలో ఫేమస్ అయిన బాలు.. గతంలో అనేక కష్టాలను అనుభవించాడట. చిన్ననాటి నుంచి పేదరికం అనుభవించిన బాలు.. పెద్దగా చదువుకోలేదు. దీంతో ఇళ్లలో పనులు చేసేవాడట. హైదరాబాద్ వచ్చిన తొలినాళ్లలో కార్లు కడగడం, ఇళ్లు తుడవటం వంటి పనులు చేసేవాడట. చివరికి బాత్‌రూమ్‌లు కూడా కడిగినట్లు ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ఒక్కోకారుకి రూ.10 ఇచ్చేవారట. అలా పనులు చేసుకుంటూ.. యాక్టింగ్‌పై ఆసక్తితో టిక్ టాక్‌లో రీల్స్ చేయడం వల్ల గుర్తింపు వచ్చిందని అంటున్నాడు.
యాప్‌లను ప్రమోట్ చేయమని...
తెలుగు రాష్ట్రాల ప్రజలకు సుపరిచితుడైన బాలు.. సంపాదించే డబ్బులో కొంత దాచుకుని, మరికొంత తన అన్నకు పంపుతారట. బాలు అన్న ఆటోడ్రైవర్ కావడంతో బాలు అతని పిల్లలను చదివిస్తున్నాడట. ఇక ఉప్పల్ బాలుకి కూడా బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేయమని అనేక మంది డబ్బులు ఆఫర్ చేశారంట. ఎన్నాళ్లు ఇలా పేదరికంలో ఉండిపోతావ్.. యాప్‌లనును ప్రచారం చేస్తే మంచి కారు, ఇళ్లు కొనుక్కోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చారంట. కానీ బాలు బెట్టింగ్ యాప్‌ల ప్రమోషన్‌కి ఒప్పుకోలేదంట.
ఉప్పల్ బాలుకి బెట్టింగ్ యాప్‌లను ప్రమోషన్ చేస్తే రూ.20 నుంచి 30 లక్షలు వరకు ఆఫర్ కూడా వచ్చిందంట. కానీ తనకు పాపం చేయడం వల్లే వచ్చే సొమ్ము వద్దని మొహంమీదే చేయను అని చెప్పేశాడంట. పేదల కష్టార్జీతం, వారి కడుపుకొట్టి వచ్చిన డబ్బు తీసుకోవడం ఇష్టం లేకనే యాప్‌లను ప్రచారం చేయలేదని చెప్పాడు బాలు. నిజంగా యాప్స్‌ని మొదటి నుంచి ప్రమోట్ చేసి ఉంటే ఇప్పటికీ రూ.6, 7కోట్లు వచ్చేవేమో అని బాలు సరదాగా చెప్పాడు.
రెండు మూడు వేల రూపాయలు..
ఇలా ఊరికే వచ్చే డబ్బుకంటే కష్టపడి సంపాదించిన డబ్బు లేదా ఇంటర్వ్యూకి వెళ్లే వచ్చే రెండు మూడు వేల రూపాయలు తనకు చాలని చెబుతున్నాడు బాలు. మూడు వేలు వస్తే.. వెయ్యి తను ఉంచుకుని ఒక వెయ్యి ఇంటికి పంపి.. ఇంకో వెయ్యి పేదవారికి సాయం చేయడానికి వాడతానని అంటున్నాడు ఉప్పల్ బాలు. మనిషి ఎలా ఉన్నా, తన ప్రవర్తన ఎలా ఉన్నా... బాలు మాటలు విన్న తర్వాత అందరూ అతన్ని ప్రశంసిస్తున్నారు. బాగా చదువుకుని, సినిమాల్లో చిన్న చిన్న అవకాశాలు వచ్చి ఫేమస్ అయిన తర్వాత బెట్టింగ్ యాప్‌లను ప్రమోట్ చేసి ఎంతోమంది ప్రాణాలు తీస్తున్న నేటి సెలబ్రిటీలకంటే.. ఉప్పల్ బాలు నిజంగా పెద్ద సెలబ్రిటీనే.