వామ్మో.. పాయల్ రాజ్ పుత్, ఆది సాయి కుమార్ బోల్డ్ రొమాన్స్ చూశారా.. సెగలు రేపుతున్న వీడియో సాంగ్

Published : Jul 26, 2022, 08:48 AM IST
వామ్మో.. పాయల్ రాజ్ పుత్, ఆది సాయి కుమార్ బోల్డ్ రొమాన్స్ చూశారా.. సెగలు రేపుతున్న వీడియో సాంగ్

సారాంశం

ప్రస్తుతం ఆది సాయి కుమార్, బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ జంటగా 'తీస్ మార్ ఖాన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఆగష్టు 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. దీనితో ప్రమోషన్స్ జోరు కూడా పెరిగింది. 

యంగ్ ఆది.. సాయి కుమార్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. కెరీర్ ఆరంభంలో ఆదికి ప్రేమ కావాలి, లవ్లీ లాంటి హిట్స్ పడ్డాయి. ఇక యువతలో ఆదికి ఫాలోయింగ్ పెరుగుతోంది అనుకున్న టైంలో కెరీర్ గాడి తప్పింది. వరుసగా ఫ్లాపులు ఎదురుకావడంతో రేసులో వేనుకబడిపోయాడు. ప్రస్తుతం ఆది వరుసగా చిత్రాలు చేస్తున్నప్పటికీ ఏది వర్కౌట్ కావడం లేదు. 

ప్రస్తుతం ఆది సాయి కుమార్, బోల్డ్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ జంటగా 'తీస్ మార్ ఖాన్' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి కళ్యాన్జీ గోగణ దర్శకుడు. ఇటీవల విడుదలైన టీజర్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆగష్టు 19న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. దీనితో ప్రమోషన్స్ జోరు కూడా పెరిగింది. 

తాజాగా ఈ చిత్రంలోని 'సమయానికే' అంటూ సాగే రొమాంటిక్ వీడియో సాంగ్ రిలీజ్ చేశారు. ఈ సాంగ్ లో పాయల్ రాజ్ పుత్, ఆది బోల్డ్ రొమాన్స్ తో రెచ్చిపోయారు. ముఖ్యంగా పాయల్ రాజ్ పుత్ తడి అందాలతో బీచ్ లో హాట్ హాట్ గా గ్లామర్ ఒలకబోస్తోంది. 

పాయల్ రాజ్ పుత్ ఫ్యాన్స్, యువత కోసమే ఈ సాంగ్ చేసినట్లు అనిపిస్తోంది. పాయల్ రాజ్ పుత్ మరోసారి తన లోని బోల్డ్ యాంగిల్ ని బయటకి తీసింది. లిరిక్స్ కూడా మత్తుగా సాగుతున్నాయి. ఈ చిత్రానికి సాయి కార్తీక్ సంగీత దర్శకుడు. రాకేండు మౌళి లిరిక్స్ అందించగా.. సింగర్ శృతి రొమాంటిక్ వైబ్స్ వచ్చేలా మత్తుగా గాత్రం అందించారు. వీడియో సాంగ్ పై మీరూ ఓ లుక్కేయండి. 

 

PREV
click me!

Recommended Stories

Akhanda 2 Release ఆగిపోవడానికి అసలు కారణం ఇదే ? బాలయ్య నెక్ట్స్ ఏం చేయబోతున్నాడు?
Dhurandhar Review: ధురంధర్ మూవీ ట్విట్టర్‌ రివ్యూ.. రణ్‌వీర్‌ సింగ్‌ సినిమాలో హైలైట్స్ ఇవే