పిక్ ఆఫ్ ది డే.. దగ్గుబాటి ఫ్యామిలీతో సమంత!

Published : Apr 23, 2019, 05:01 PM IST
పిక్ ఆఫ్ ది డే.. దగ్గుబాటి ఫ్యామిలీతో సమంత!

సారాంశం

విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. 

విక్టరీ వెంకటేష్ పెద్ద కూతురు ఆశ్రిత వివాహం ఇటీవల జరిగిన సంగతి తెలిసిందే. జైపూర్ లో కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలోహైదరాబాద్ రేస్ క్లబ్ చైర్మన్ సురేందర్ రెడ్డి మనవడు వినాయక్ రెడ్డిని వివాహం చేసుకుంది ఆశ్రిత.

అయితే ఆ పెళ్లి సందర్భంగా తీసుకున్న ఓ ఫోటోని సమంత తాజాగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. వెంకీ ఫ్యామిలీతో కలిసి సామ్ తీసుకున్న ఈ ఫోటో అభిమానులను ఆకట్టుకుంటోంది. 

వెంకీ, అతడి భార్య నీరజ.. వారి ముగ్గురు కుమార్తెలతో పాటు సురేష్ బాబు కూతురు మాళవిక పొట్లూరి కూడా ఈ ఫోటోలో కనిపిస్తోంది. ఇక సినిమాల విషయానికొస్తే ప్రస్తుతం సమంత.. నందిని రెడ్డి దర్శకత్వంలో ఓ సినిమాలో నటిస్తోంది. అలానే '96' రీమేక్ లో నటించడానికి సిద్ధమవుతోంది. 
  

PREV
click me!

Recommended Stories

Pawan Kalyan OG2: పవన్ కళ్యాణ్‌ను కలిసిన సుజీత్, ఇదేం స్పీడు బాబోయ్.. ఓజీ 2 కథా చర్చలు షురూ
Ananya Nagalla: యోగా డే విన్యాసాలతో ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న అనన్య నాగళ్ళ.. ఫోటోస్, వీడియోస్ వైరల్